విజయ్ 'కింగ్ డమ్' రిజల్ట్.. నాగ వంశీ ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-10-26 04:44 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్పై యాక్షన్ జోనర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ గా మూవీని రూపొందించారు.

ప్రమోషన్స్ తో రిలీజ్ కు ముందు సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. భారీ అంచనాల మధ్య సినిమాను విడుదల చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఆడియన్స్ తోపాటు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. బాక్సాఫీస్ వద్ద నష్టాలు ఎక్కువగా వచ్చాయని కూడా ఆ మధ్య టాక్ వినిపించింది.

ఇప్పుడు కింగ్ డమ్ రిజల్ట్ పై నాగవంశీ స్పందించారు. ఆయన నిర్మించిన మాస్ జాతర మూవీ.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. దీంతో సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఆ సమయంలో ఓ ఇంటర్వ్యూలో కింగ్ డమ్ మూవీ ఫలితంపై మాట్లాడి క్లారిటీ ఇచ్చారు నాగవంశీ.

కింగ్ డమ్ మూవీ డిజాస్టర్ కాదని తెలిపారు. సినిమా మంచి వసూళ్లు రాబట్టిందని తెలిపారు. అంచనాలు అందుకోకపోయినా.. ఫెయిల్యూర్ గా పరిగణించవద్దని అన్నారు. విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రాలు ఖుషి, ఫ్యామిలీ స్టార్‌ సినిమాలు కన్నా కింగ్‌ డమ్ బాక్సాఫీస్ వద్ద మెరుగ్గానే రాణించిందని నాగవంశీ చెప్పుకొచ్చారు.

నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ను మిలియన్ డాలర్స్ కన్నా కింగ్ డమ్ మూవీ ఎక్కువ వసూలు చేసిందని చెప్పిన నాగవంశీ.. ఓవరాల్ గా దాదాపు 1.8 మిలియన్ల డాలర్లు సాధించిందని వెల్లడించారు. నైజాం ప్రాంతంలో దాదాపు రూ.11 కోట్లను ఆర్జించిందని తెలిపారు. జీఎస్టీ సర్దుబాట్ల తర్వాత బయర్స్ సేఫ్ అయ్యారని చెప్పారు.

చాలా కొద్ది మంది మాత్రమే.. అది కూడా వారు స్పల్ప నష్టాలను చవిచూశారని తెలిపారు. అనేక చోట్ల.. 70 శాతానికి పైగా రికవరీ అయిందని తెలిపారు. మరికొన్ని చోట్ల 80 నుంచి 90 శాతం వరకు సాధించిందని పేర్కొన్నారు. ఏదేమైనా వసూళ్ళ పరంగా చూసుకుంటే.. కింగ్ డమ్ మూవీ.. యావరేజ్ కంటే ఎక్కువ మూవీ అని అన్నారు. అంతే కాని ఫెయిల్యూర్ మాత్రం కాదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News