నేను సింగిల్ కాదు: విజయ్ దేవరకొండ

టాలెంటెడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.;

Update: 2025-07-09 06:26 GMT

టాలెంటెడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవల పూర్తవగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేయనున్నారు. విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. కింగ్‌డమ్ తర్వాత విజయ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే పీరియాడికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఇదే నేపథ్యంలో మరో ఆసక్తికర విషయాన్ని విజయ్ స్వయంగా బయటపెట్టాడు.

తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తన వ్యక్తిగత జీవితం గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు. "నాకు 35 ఏళ్ళు.. ఖచ్చితంగా సింగిల్ కాదు" అంటూ స్పష్టంగా చెప్పారు. దీంతో రష్మికతో ఇప్పటికే వస్తున్న గాసిప్స్ ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే విజయ్ మాత్రం రష్మిక పేరును ప్రస్తావించకుండా, పర్సనల్ విషయాల్లో ప్రైవసీకి విలువ ఇస్తానని అన్నారు.

విజయ్ మాట్లాడుతూ.. “ఓ నటుడిగా క్రేజ్ అందుకోవాలన్నా, గుర్తింపు రావాలన్నా కోరిక ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రైవసీ గా ఉండాలన్న ఆలోచన కూడా కలుగుతుంది. ఇదొక సైకాలజికల్ కాంఫ్లిక్ట్‌” అని వివరించారు. విజయ్ ఇలా చెప్పడంతో ఆయన రిలేషన్ స్టేటస్ గురించి నెట్‌లో మళ్లీ చర్చ మొదలైంది. ముఖ్యంగా రష్మికతో కలిసి ఎయిర్‌పోర్ట్‌, వెకేషన్‌లలో కనిపించిన ఫొటోలు ఇప్పుడేమో నిజమయ్యాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక కలిసి కనిపించడం, అదే కారులో ప్రయాణించడం మరింత ఊహాగానాలకు దారితీసింది. గతంలో రష్మిక కూడా విజయ్ పై ప్రేమతో ఓ కామెంట్ చేయడంతో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. అయినా ఇప్పటివరకు ఈ ఇద్దరూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి కింగ్‌డమ్ ప్రాజెక్టుతో పాటు విజయ్ రష్మిక స్టోరీ కూడా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబో సెట్టయితే రాహుల్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హైప్ సృష్టించే అవకాశం ఉంది. ఇక విజయ్ పర్సనల్ లైఫ్ పై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

Tags:    

Similar News