మరోసారి విజయ్ తో రష్మిక.. ఇదిగో హింట్
ఈ సినిమాలో రష్మిక నటించనుందని వస్తున్న వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ #HMMLetsee అని రష్మికను ట్యాగ్ చేయడంతో దానికి రష్మిక ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీని రిప్లై ఇచ్చింది.;
స్క్రీన్ పై కొన్ని కాంబినేషన్లకు ఎంతో డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. అలా డిమాండ్ ఉన్న కాంబినేషన్లలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాది ఒకటి. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో కింగ్‌డమ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ, దాని తర్వాత తనకు ట్యాక్సీవాలా లాంటి సూపర్ హిట్ ను అందించిన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ సినిమాను అనౌన్స్ చేసిన రాహుల్, ప్రస్తుతం సెట్ వర్క్స్ లో బిజీగా ఉన్నాడు.
శ్యామ్ సింగరాయ్ తర్వాత దాదాపు రెండేళ్లు ఒకే కథపై కూర్చున్న రాహుల్, విజయ్ కోసం చాలా సాలిడ్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడని తెలుస్తోంది. విజయ్ తో రాహుల్ ఈసారి ప్రయోగం చేయబోతున్నాడట. రాజుల కాలం నాటి కథతో శతాబ్దాల కాలానికి వెళ్లి మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకోనున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక నటించనుందని వస్తున్న వార్తలపై మైత్రీ మూవీ మేకర్స్ స్పందిస్తూ #HMMLetsee అని రష్మికను ట్యాగ్ చేయడంతో దానికి రష్మిక ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీని రిప్లై ఇచ్చింది. దీంతో రాహుల్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ అనే విషయం క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతూ దూసుకెళ్తున్న విషయంత తెలిసిందే. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో పాటూ యానిమల్ తో తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకున్న రష్మిక చేతిలో ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు రష్మిక వీడీ14లో కూడా నటిస్తే ఈ సినిమాకు రష్మిక స్పెషల్ ఎట్రాక్షన్ గా మారడం ఖాయం.