• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విజయ్‌ దేవరకొండ, రష్మిక...

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ వార్తల్లో...!

| రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By - Tupaki Desk
Update: 2024-11-18 07:30 GMT

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇంకా టైటిల్‌ను ఖరారు చేయని ఆ సినిమాతో వచ్చే ఏడాదిలో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు విజయ్ దేవరకొండ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. అందులో ఒకటి రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. విజయ్ దేవరకొండ కెరీర్‌ ఆరంభంలో వచ్చిన ట్యాక్సీవాలా సినిమాకు దర్శకత్వం వహించిన రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరోసారి నటించేందుకు రెడీ అవుతున్నాడు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌కి పేరు దక్కింది. ట్యాక్సీవాలా సినిమాతో పాటు శ్యామ్‌ సింగ రాయ్‌ కథలు చాలా డిఫరెంట్‌ జోనర్‌లో ఉంటాయి. హర్రర్‌, థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాహుల్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

విజయ్ దేవరకొండ, రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం హీరోయిన్‌ రష్మిక మందన్నతో చర్చలు జరిగాయట. రౌడీ స్టార్‌ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. అయితే సినిమాలో ఆమె హీరోయిన్‌ గా నటించబోవడం లేదని కూడా తెలుస్తోంది. ఐటెం సాంగ్‌ లేదా ప్రత్యేకమైన పాత్రలో రష్మిక కనిపించే అవకాశాలు ఉన్నాయి. రష్మిక ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌. పుష్ప 2 తో ఆమె స్థాయి మరింత పెరగడం ఖాయం. అలాంటి రష్మిక ఐటెం సాంగ్‌ లో లేదా ప్రత్యేక పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండకు రష్మిక మందన్న కు ఉన్న స్నేహంతో గెస్ట్ గా నటించేందుకు ఓకే చెప్పి ఉండవచ్చు. అయితే రష్మిక గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చినా, ఐటెం సాంగ్‌ చేసినా కచ్చితంగా సినిమా ఓ రేంజ్‌లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడం కోసం విజయ్‌ దేవరకొండ బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు సినిమాలతో రాబోతున్నాడు. ఆ మూడు సినిమాల్లో రెండు సినిమాల్లో రష్మిక గెస్ట్‌ అప్పియరెన్స్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • Vijaydevarakonda 
  • Rashmika 
  • Tollywood 
  • Filmindustry 
  • Rahulsankrityan 
  • Pushpa2 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS