ఆ విషయంలో పట్టు వదలని విక్రమార్కుడు విజయ్ ఆంటోనీ
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ ఆంటోనీ తన సంగీతం ద్వారా మంచి గుర్తింపే అందుకున్నారు.;
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ ఆంటోనీ తన సంగీతం ద్వారా మంచి గుర్తింపే అందుకున్నారు. ఆ తర్వాత పదేళ్ల కిందట వచ్చిన బిచ్చగాడు అనే సినిమాలో టైటిల్ రోల్ పోషించి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ఆంటోనీ ఆ మార్కెట్ ను ఇప్పటికీ కాపాడుకుంటూ రావడం విశేషమనే చెప్పాలి. బిచ్చగాడు సినిమా తర్వాత నుంచి విజయ్ ఆంటోనీ నటుడిగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు.
అయితే ఎన్ని సినిమాలు చేసినా విజయ్ ఆంటోనీకి బిచ్చగాడు రేంజ్ సక్సెస్ మాత్రం మళ్లీ దక్కింది లేదు. మధ్యలో రెండు మూడు సినిమాలు యావరేజ్ టాక్ ను తెచ్చుకున్నాయి కానీ హిట్ టాక్ మాత్రం రాలేదు. సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా విజయ్ ఆంటోనీ నటుడిగా సినిమాలను చేస్తూనే వస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ ఆంటోనీ కొత్త సినిమా మార్గన్ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కోలీవుడ్ లో ఎడిటర్ గా ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న లియో జాన్ పాల్ ఈ మార్గన్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ప్రమోషన్స్ విషయంలో కూడా బాగానే హడావిడి చేశారు అయినప్పటికీ మార్గన్ పై ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి తోడు గత వారం రిలీజైన కుబేర మంచి బుకింగ్స్ తో రన్ అవుతుంది. అయినా సరే తమిళంతో పాటూ ఒకేసారి తెలుగులో కూడా సమాంతరంగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మేకర్స్ జూన్ 27నే రిలీజ్ చేస్తున్నారు.
మార్గన్ సక్సెస్ పై విజయ్ ఆంటోనీ చాలా నమ్మకంగా ఉన్నారు. తన సినిమాలకు ఆదరణ ఉన్నా లేకపోయినా ప్రతీ సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విజయ్ ఆంటోనీని ఈ విషయంలో మాత్రం ప్రశంసించాల్సిందే. ఏదొక సినిమాతో హిట్ రాకపోతుందా అనే నమ్మకంతో విజయ్ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరి మార్గన్ అయినా విజయ్ కు తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.