• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నోటా' వాయిదా లేదు

'నోటా' వాయిదా లేదు

By - Tupaki Desk
Update: 2018-09-18 05:47 GMT
ఫిలింస‌ర్కిల్స్ లో `గీత గోవిందం` సంచ‌ల‌నాల గురించి ఇంకా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతూనే ఉంది. ఇటు టాలీవుడ్ స‌హా అటు కోలీవుడ్ - బాలీవుడ్‌ లోనూ ఈ సినిమా గురించిన అంద‌రిలో ఆస‌క్తిక‌ర డిబేట్ సాగింది. అందుకే ఇప్పుడు విజ‌య్ దేవ‌రకొండ బ్రాండ్ మార్మోగిపోతోంది. ఆ పేరు వింటేనే మార్కెట్ వ‌ర్గాల్లో ఒక‌టే ఉత్కంఠ. నటించిన నాలుగో సినిమాకే 100 కోట్ల క్ల‌బ్ హీరోగా రికార్డులు సృష్టించిన దేవ‌ర‌కొండ చుట్టూ ప్ర‌స్తుతం ఒక‌టే ఎగ్జ‌యిట్‌ మెంట్. అత‌డి సినిమా నోటా చుట్టూ నోట్లాట మొద‌లైంది. ఈ సినిమా వ‌స్తోంది అంటే అటూ ఇటూ ఇత‌ర రిలీజ్‌ ల విష‌య‌మై సందిగ్ధ‌త నెల‌కొన‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది.

దేవ‌ర‌కొండ తాజా చిత్రం `నోటా` రిలీజ్‌ వార్‌ లో ఉందిప్పుడు. ఇటీవ‌లే ట్రైల‌ర్ రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌ కి జ‌నం నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. స‌రిగ్గా తెలుగు రాష్ట్రాల్లో సిస‌లైన‌ పొలిటిక‌ల్ స్టంట్ మొద‌లైన వేళ `నోటా` అంటూ వ‌స్తున్నాడు దేవ‌ర‌కొండ‌. అత‌డి టైమింగ్ పెర్ ఫెక్ట్ అన్న ముచ్చ‌టా సాగుతోంది. ఈ నేప‌థ్యం నోటాపై హైప్‌ ను పెంచుతోంది. ఆ క్ర‌మంలోనే మేక‌ర్స్ నోటా ప్ర‌చారంలోనూ వేడి పెంచే ఆలోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నులు వేగంగా పూర్త‌వుతున్నాయ‌ని తెలుస్తోంది.

నిన్న‌టికి నిన్న‌ ఈ సినిమా వాయిదా ప‌డింద‌ని - ముందే ప్ర‌క‌టించిన‌ట్టు అక్టోబ‌ర్ 4న‌ రావ‌డం లేద‌ని ప్ర‌చారం సాగింది.  అక్టోబ‌ర్ 18న రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని కొంద‌రు తేదీని ప్ర‌క‌టించేస‌రికి ట్రేడ్‌ లో డైలమా నెల‌కొంది. కానీ నోటా మేక‌ర్స్ ఈ విష‌యాన్ని ఖండించారు. చెప్పిన తేదీకే వ‌స్తున్నాం. అక్టోబ‌ర్ 4 లేదా 5 తేదీల్లో క‌న్ఫామ్‌ గా వ‌చ్చేస్తున్నామ‌ని తెలిపారు. దీంతో సస్పెన్స్ వీడింది. ఇప్పుడు ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ - రామ్ హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే చిత్రాల‌కు స్కోప్ పెరుగింద‌న్న మాటా వినిపిస్తోంది. ఈ సినిమాల‌తో పాటు విశాల్‌- లింగుస్వామి  `పందెంకోడి 2` రిలీజ్‌ కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    
  • Vijay Deverakonda 
  • NOTA Movie 
  • Telugu NEWs 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

Copyright @2026

Powered by Blink CMS