బిడ్డ పుట్టిన తర్వాత స్టార్‌ కపుల్‌ ఏం కొన్నారో తెలుసా..!

ఈ ఏడాది ఛావా సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌.;

Update: 2025-12-06 12:30 GMT

ఈ ఏడాది ఛావా సినిమాతో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌. సినిమా కెరీర్‌ పరంగా ఛావా సినిమా కెరీర్‌కి కీలకం కాగా, ఇదే ఏడాది ఆయన వ్యక్తిగత జీవితంలోనూ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్‌ నవంబర్‌ లో బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి అయిన విక్కీ కౌశల్‌ ఆనందానికి అవధులు లేవు. అందుకే 2025 సంవత్సరం విక్కీ కౌశల్‌కి అత్యంత కీలకం అంటూ ఆయన సన్నిహితులు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాదిని మరింత స్పెషల్‌గా మార్చడం కోసం విక్కీ కౌశల్‌ తన ఇంటి గ్యారేజ్‌ కి మరో కారును తీసుకు వచ్చాడు. తమ ఫ్యామిలీలో మెంబర్‌ పెరిగారు అంటూ విక్కీ కౌశల్‌, కత్రీనా కైఫ్‌లు సన్నిహితులతో చెప్పుకొచ్చారు. తాజాగా ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఖరీదైన కారు కొనుగోలు చేసిన దంపతులు...

విక్కీ కౌశల్‌, కత్రీనా దంపతులు నవంబర్‌ నెలలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆ బిడ్డ పుట్టి నెల రోజులు కాకుండానే తమ ఇంటికి కొత్త లెక్సస్‌ LM350h 4S కారును తీసుకు వచ్చారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ఈ కారులోనే ఎక్కువగా కనిపిస్తున్నారు అంటూ స్థానిక మీడియా వారు అంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడం కోసం విక్కీ కౌశల్‌ ఇదే కారు నుంచి స్టైలిష్ గా దిగుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ కారు గురించి సోషల్‌ మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. కారు సెక్యూరిటీ ఫీచర్స్ మొదలుకుని పలు విషయాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. దాంతో విక్కీ కౌశల్‌ కారు వైరల్‌ అయింది. ఆయన కారులో ఉన్న ఫోటోలు, వీడియోలు సైతం వైరల్‌ అవుతున్నాయి. విక్కీ కౌశళ్‌, కత్రీనా కైఫ్ దంపతుల స్టార్‌డం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి స్టార్‌ స్టేటస్‌కి తగ్గ కారు అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు.

విక్కీ కౌశల్‌, కత్రీనా కైఫ్‌ బిడ్డతో...

ఈ కారు ఖరీదు దాదాపుగా రూ.3.25 కోట్లుగా చెబుతున్నారు. ముంబైలో ఈ మోడల్‌కి చెందిన కార్లు చాలా తక్కువగా ఉంటాయని, అత్యంత ఖరీదైన ఈ కార్లు వీవీ ఐపీల వద్ద మాత్రమే ఉంటాయని ముంబై మీడియా వర్గాల వారు చెబుతున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ తమ స్టార్‌ స్టేటస్‌ను చూపించడం కోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఖరీదైన కార్లలో తిరగాల్సి ఉంటుందని ఆ మధ్య దుల్కర్‌ సల్మాన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. అందుకు తగ్గట్లుగానే బాలీవుడ్‌ స్టార్స్‌ ఎప్పటికప్పుడు కొత్త కార్లను, ఖరీదైన కార్లను మారుస్తూ ఉంటారు. ఖరీదైన కార్లతో తమ స్టార్‌డంను నిరూపించుకోవడం ఒక ఎత్తు అయితే, తమ ఫ్యామిలీ సేఫ్టీ, సెక్యూరిటీ మరో ఎత్తు అన్నట్టు కొందరు మాట్లాడుతున్నారు. విక్కీ కౌశల్‌, కత్రీనాలు బిడ్డ పుట్టిన తర్వాత కారు కొన్నారు కనుక ఆ బిడ్డ కోసం అని చాలామంది మాట్లాడుతున్నారు.

ఛావా సినిమా తర్వాత లవ్‌ అండ్‌ వార్‌ సినిమాతో...

విక్కీ కౌశల్‌ ఈ ఏడాదిలో ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పలువురు నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చేందుకు క్యూ కట్టారు. కానీ ఆయన మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ఈయన లవ్‌ అండ్‌ వార్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ భారీ మల్టీస్టారర్‌ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటాను అనే విశ్వాసంను విక్కీ కౌశల్‌ వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ వర్క్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కత్రీనా కైఫ్‌ బిజీగా ఉన్న సమయంలోనే ప్రెగ్నెన్సీ కారణంగా మెల్లగా ఇండస్ట్రీకి దూరంగా జరిగింది. బిడ్డ కాస్త పెద్ద అయిన తర్వాత కత్రీనా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆమె ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News