• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమిళ దర్శకుడిపై తారక్...

తమిళ దర్శకుడిపై తారక్ ఫోకస్

| యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తమిళ్ ఆడియన్స్ కూడా మెల్లగా ఓన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి తమిళంలో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-09-18 03:41 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తమిళ్ ఆడియన్స్ కూడా మెల్లగా ఓన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకి తమిళంలో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘దేవర’ సినిమాకి అంతకుమించి స్పందన వస్తుందని భావిస్తున్నారు. దీనికి కారణం ఉంది. ఎన్టీఆర్ తమిళ్ దర్శకుల శైలిని, వారు చెప్పే కథలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చాలా కాలం నుంచి ఎన్టీఆర్ తో వెట్రిమారన్, అట్లీ లాంటి దర్శకులు సినిమాలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది.

గతంలో వీరిద్దరూ ఎన్టీఆర్ ని కలిసి కథలు కూడా నేరేట్ చేయడం జరిగిందని టాక్. వెట్రిమారన్ ‘విడుదలై’ సినిమా రిలీజ్ సమయంలో కోవిడ్ కి ముందు ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పడం జరిగిందని తెలిపారు. కథ అతనికి నచ్చిందని, అయితే వరుస కమిట్మెంట్స్ కారణంగా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు. దానిని బట్టి వెట్రిమారన్ దర్శకత్వంలో మూవీ కన్ఫర్మ్ అయ్యిందనే ప్రచారం అప్పట్లోనే వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కోలీవుడ్ డెబ్యూ గురించి తన మనసులో మాట బయటపెట్టారు. ‘దేవర’ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ చెన్నైకి వెళ్లారు. అక్కడ తమిళ్ మీడియా మీట్ లో తారక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటరెస్టింగ్ విషయాలని పంచుకున్నారు. స్ట్రైట్ తమిళ్ మూవీ మీరు ఎప్పుడు చేస్తారు సర్ అని ఓ జర్నలిస్ట్ ఎన్టీఆర్ ని ప్రశ్నించారు. దీనికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ వెట్రిమారన్ కి రిక్వెస్ట్ చేశారు.

నా అభిమాన దర్శకుడు వెట్రిమారన్. అతను ఎప్పుడు నాతో సినిమా చేస్తానంటే అప్పుడు నేను తమిళంలో చేస్తాను అని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. వెట్రిమారన్ సర్ నాతో మూవీ చేయండి. అది స్ట్రైట్ తమిళ్ లో చేసి తెలుగులో డబ్ చేద్దాం అంటూ ఎన్టీఆర్ స్టేజ్ పైనే రిక్వెస్ట్ పెట్టారు. మరి దీనిపై వెట్రిమారన్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వెట్రిమారన్ చెప్పే కల్ట్ కథలో ఎన్టీఆర్ నటిస్తే కచ్చితంగా అవి దేశ వ్యాప్తంగా అందరికి రీచ్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

గతంలో వీరిద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయి కాబట్టి కచ్చితంగా మూవీ ఉంటుందని ఎన్టీఆర్ మాటలతో కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ‘వార్ 2’, ‘డ్రాగన్’, ‘దేవర2’ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాల తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో మూవీ ఉండొచ్చని టాక్.

Tags:    
  • NTR 
  • Tamildirector 
  • Vetrimaaran 
  • Devara 
  • Filmindustry 
  • Tarak 
  • Devarapromotions 
  • War2 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS