• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెన్నెల కిశోర్ నయా...

వెన్నెల కిశోర్ నయా అవతార్​.. స్పై యాక్షన్ హీరోగా

| ఈ చిత్రానికి డిఫరెంట్​గా చారీ 111 అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఈ సినిమాను బార్కట్​ స్డూడియోస్​ బ్యానర్​పై అడితి సోని నిర్మిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-23 05:25 GMT

టాలీవుడ్‌ సినీప్రియులకు పరిచయం అవసరం లేని పేరు వెన్నెల కిశోర్‌. తనదైనశైలిలో కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను నవ్విస్తుంటారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, అలీ, సునీల్ తర్వాత.. ఇప్పుడు జనరేషన్​ హాస్యనటుల్లో టాప్​లో ఉన్నారాయన. పెర్ఫామెన్స్ విషయంలో, నవ్వించడంలో తనకు తానే సాటి అనేలా కెరీర్​లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

తొలి సినిమా వెన్నెల దగ్గర్నుంచి తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఏర్పరుచుకుని నవిస్తున్న కిశోర్ పేరు వినగానే.. తెలుగు ప్రేక్షకుల ముఖాలపై ఆటోమేటిగ్గా చిరునవ్వు పులుముకుంటుంది. అయితే ఇప్పుడాయన హీరోగా అవతారం ఎత్తనున్నారు. స్పై యాక్షన్ కామెడీ చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. అక్కినేని హీరో సుమంత్​తో మళ్లీ మొదలైంది సినిమా చేసిన దర్శకుడు టీజీ కీర్తి కుమార్​.. వెన్నెల కిశోర్​ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ చిత్రానికి డిఫరెంట్​గా చారీ 111 అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఈ సినిమాను బార్కట్​ స్డూడియోస్​ బ్యానర్​పై అడితి సోని నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు మురళి శర్మ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కిశోర్ సీక్రెట్ స్పైగా కనిపించనుండగా.. మురళి శర్మ స్పై ఏజెన్సీ హెడ్​గా కనిపించనున్నారు. సంయుక్త విశ్వనాథన్​ ఫీమెల్​ లీడ్​రోల్​లో కనిపించనున్నారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్​ కూడా అదిరిపోయింది. ఇందులో వెన్నెల కిశోర్ సూట్ బూటు వేసుకుని చేతిలో గన్​ పట్టుకుని కనిపించారు. ఈ పోస్టర్​ యానిమేషన్​ తరహాలో డిజైన్ చేశారు. గ్లింప్స్​ను కూడా యానిమేషన్​ తరహాలోనే విడుదల చేశారు. తెలుగు సినిమా ఓ సినిమాను యానిమేషన్​ తరహాలు అనౌన్స్​ చేయడం ఇదే తొలిసారి.

ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్య, రాహుల్​ రవీంద్రన్ నటిస్తున్నారు. సైమన్ కె కింగ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాశీశ్​ గ్రోవర్​ సినిమాటోగ్రఫీ చూసుకుంటున్నారు. ఈ యాక్షన్​ కామెడీ రోలర్​ కోస్టర్ రైడ్ తరహాలో ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా, యాక్షన్​ కామెడీగా ఉంటుంది దర్శకుడు టీజీ కీర్తి కుమార్ పేర్కొన్నారు.

Full View
Tags:    
  • Tollywood 
  • Comedian 
  • Vennelakishore 
  • Chaari111 
  • Chaari111movie 
  • Announcement 
  • Tgkeerthikumar 
  • Aditisoni 
  • Barkatstudios 
  • Muralisharma 
  • Samyuktaviswanathan 
  • Brahmaji 
  • Satya 
  • Rahulravindran 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS