• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాబిన్ హుడ్.. రష్మికను...

రాబిన్ హుడ్.. రష్మికను ఎందుకు తీసుకోలేదంటే: దర్శకుడు

| తాజాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు వెంకీ కుడుముల పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-27 13:20 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్.’ ప్రస్తుతం ఈ సినిమా గురించి మంచి క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు వెంకీ కుడుముల పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

అందులో రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. "రష్మిక మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయాల్సి ఉంది. కానీ, ఆమె చేతిలో అప్పటికే ‘పుష్ప 2’ సహా రెండు హిందీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి కోసం షెడ్యూల్‌లను పక్కా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ, ఈ సినిమా కోసం ఆమె డేట్స్ అందుబాటులో లేవు అని తేలింది. దాంతో, ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోవాలని నిర్ణయించాం," అని వెంకీ వివరించారు.

అదేవిధంగా రష్మిక ఈ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఉంటుందనే ప్రచారంపై స్పందిస్తూ, "ఇది పూర్తిగా అబద్దం. రష్మిక ఈ సినిమాలో కనిపించడంలేదు. శ్రీలీల ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తోంది, ఆమె లుక్, నటన తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి," అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి వెంకీ మాట్లాడుతూ, "ఇప్పటివరకు నేను తీసిన చిత్రాల్లో ఇదే బెస్ట్ అని చెప్పగలను.

ప్రీ-ప్రొడక్షన్ సమయంలో స్క్రిప్ట్‌పై మరింత ఎక్కువ సమయం కేటాయించగలిగాను. ఫలితంగా, ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. సెలవుల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, క్రిస్మస్ కోసం ఈ సినిమాను సిద్ధం చేశాం. ప్రతి కుటుంబాన్ని థియేటర్లకు రప్పించేలా ఈ సినిమా ఉంటుంది," అని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నో అనే వినూత్న పాత్రలో కనిపించనున్నారు.

వెన్నెల కిశోర్ మరో ప్రధాన పాత్రలో ప్రేక్షకులను నవ్వించనున్నారు. సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే నితిన్ కొన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్నా, ఇటీవల విజయాల కోసం ఎదురుచూస్తున్నాడు. ‘భీష్మ’ వంటి హిట్ తర్వాత ‘రాబిన్ హుడ్’తో మళ్లీ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాడు. శ్రీలీల, నితిన్ జోడీ స్క్రీన్ పై ఎలా మెరవనుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి, రాబిన్ హుడ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    
  • Venkykudumula 
  • Robinhood 
  • Chalo 
  • Bhisma 
  • Nitin 
  • Sreeleela 
  • Tollywood 
  • Robinhoodmovie 

Similar News

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS