• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీనియర్ స్టార్.. ఈసారి...

సీనియర్ స్టార్.. ఈసారి గట్టి ప్లానింగ్ తోనే..?

| విక్టరీ వెంకటేష్ సైంధవ్ ఇచ్చిన షాక్ నుంచి బయటకు వచ్చి ఒకేసారి రెండు సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు

By - Tupaki Desk
Update: 2024-07-14 07:26 GMT

విక్టరీ వెంకటేష్ సైంధవ్ ఇచ్చిన షాక్ నుంచి బయటకు వచ్చి ఒకేసారి రెండు సినిమాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. వెంకటేష్ హీరోగా అనీల్ రావిపుడి డైరెక్షన్ లో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. F2, F3 సినిమాలతో హిట్లు అందుకున్న ఈ కాంబో మరో సూపర్ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఐతే ఎప్పుడు ఒక సినిమా పూర్తి చేసి కానీ మరో సినిమా గురించి ప్లాన్ చేసే వెంకటేష్ ఈసారి అలా కాకుండా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో ప్రాజెక్ట్ ని రెడీ చేస్తున్నాడు.

ఈసారి వెరైటీగా ఒక యువ దర్శకుడితో అది కూడా డిఫరెంట్ అటెంప్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. నీది నాది ఒకే కథ సినిమాతో డైరెక్టర్ గా తన మార్క్ చూపించిన వేణు ఊడుగుల తన సెకండ్ సినిమా విరాటపర్వం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తను చెప్పే కథల్లో చాలా డెప్త్ ఉన్నాయని ఆడియన్స్ గుర్తించడంతో వేణు చేసే ప్రతి సినిమా మీద ఆడియన్స్ ఒక కన్ను వేసి ఉంచారు.

ఇలాంటి యువ దర్శకుడితో వెంకటేష్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. వెంకీ మామకు వేణు ఊడుగుల ఎలాంటి కథ చెప్పి ఒప్పించాడో కానీ ఈ సినిమా మాత్రం వెంకటేష్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ తో అనీల్ రావిపుడి చేస్తున్న సినిమా కూడా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. నెక్స్ట్ వేణు ఊడుగులతో చేసే సినిమా కూడా అంతకుమించి అనేలా ఉంటుందని తెలుస్తుంది.

ఈ రెండు సినిమాలతో వెంకటేష్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నట్టు అర్థమవుతుంది. సీనియర్ స్టార్స్ లో వెంకటేష్ ఒక్కడే కాస్త వెనకపడి ఉన్నాడు. అందుకే యువ దర్శకులతో అదరగొట్టే సినిమాలు చేయాలని చూస్తున్నాడు. వెంకటేష్ మార్క్ ఎమోషనల్ కథ పడితే మాత్రం అది సెన్సేషనల్ హిట్ పడటం పక్కా అని చెప్పొచ్చు. మరి రాబోతున్న రెండు సినిమాల్లో వెంకటేష్ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడన్నది చూడాలి. ఇవే కాకుండా వెంకటేష్ రానా నాయుడు 2 లో కూడా నటించనున్నాడు. రానా నాయుడు సూపర్ హిట్ అవ్వడంతో ఆ సీరీస్ సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే ఈ సీరీస్ లో వెంకటేష్ తన ఇమేజ్ కి భిన్నంగా కొత్త లుక్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో కనిపించారన్న సంగతి తెలిసిందే.

Tags:    
  • Venkatesh 
  • Venuudugula 
  • Tollywood 
  • Virataparvam 
  • Filmindustry 
  • Venkateshvenuudugula 
  • Rananaidu2 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS