వెంక‌ట‌ర‌మ‌ణ నేప‌థ్య‌మంతా విశాఖ‌!

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-08-14 09:54 GMT

విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రానికి స‌న్నాహాలు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. వెంకీ-గురూజీ మార్క్ చిత్రంగా మ‌లుస్తున్నారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో వెంక‌టేష్ కున్న ఇ మేజ్ ఆధారంగానే త్రివిక్ర‌మ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనింగ్ క‌థ‌ను రాసిన‌ట్లు వినిపిస్తుంది. 'వెంక‌టర‌మ‌ణ' అనే టైటిల్ కూడా ఫిక్సైంద‌ని స‌మాచారం. ఈ క‌థ పూర్తిగా విశాఖ‌పట్ట‌ణం నేప‌థ్యంలోనే సాగుతుందిట‌. విశాఖ‌లో దిగుమ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ 50 ఏళ్ల వ్య‌క్తి క‌థ‌గా ఆవిష్క‌రిస్తున్నారట‌.

కుటుంబ అనుంబంధాల నేప‌థ్యానికి త్రివిక్ర‌మ్ మార్క్ హాస్యాన్ని జోడించి సిద్దం చేసిన స్క్రిప్ట్ అని తెలిసింది. విశాఖ‌-అన‌కాప‌ల్లి ప్రాంతాల‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గురూజీ ఈ క‌థ‌లో హైలైట్ చేయ‌బోయ‌బోతున్నారట‌. త్రివిక్ర‌మ్ అంటే బ‌ల‌మైన డైలాగులు...బంధాలు..భావోద్వేగంతో క‌థ‌ను న‌డిపించ గ‌ల దిట్ట‌. ఇలాంటి క‌థ‌లు రాయ‌డం కొట్టిన పిండి. 'అత‌డు', ' అత్తారింటికి దారేది', 'స‌న్నాఫ్ స్య‌త్య‌మూర్తి', 'అఆ', 'అర‌వింద స‌మేత‌', 'అల వైకుంఠ‌పుర‌ములో' లాంటి చిత్రాల్లో ఎమోష‌న్ పాత‌తే అయినా త‌న‌దైన ట్రీట్ మెంట్ తో ర‌క్తి క‌ట్టించారు. వాటిలో హాస్యం అంతే పండుతుంది.

అలాంటి డైరెక్ట‌ర్ కి వెంకీ లాంటి కామెడీ టింజ్ ఉన్న న‌టుడు తోడైతే? ఎమోష‌న్ తో పాటు, హాస్యానికి ఛాన్స్ ఉంటుంది. వెంక‌ట‌ర‌మ‌ణ‌ని ఈ పాయింట్ ఆధారంగానే రాసిన‌ట్లు స‌న్నిహితుల స‌మాచారం. ఇప్ప‌టికే ఇద్ద‌రి కాంబినేష‌న్ లో 'మ‌ల్లీశ్వీరి', 'నువ్వు నాకు న‌చ్చావ్' లాంటి సినిమాలు తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రెండింటికీ డైరెక్ట‌ర్ వేరైనా రైట‌ర్ గా ప‌నిచేసింది త్రివిక్ర‌మ్. వెంకీ శైలి..ఇమేజ్ ఆధారంగా త‌యారైన క‌థ‌లవి. 'మ‌ళ్లీశ్వ‌రీ'  కూడా వైజాగ్ నేప‌థ్యంలో సాగిన చిత్ర‌మే.

ఆ రెండు మంచి విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వెంక‌ట‌ర‌మ‌ణ‌పై బ‌జ్ బాగానే క్రియేట్ అవుతుంది. వెంక‌టేష్ ఎన్నిజాన‌ర్లో సినిమాలు చేసినా ఫ్యామిలీ జాన‌ర్ ని మాత్రం ఇప్ప‌టికి విడిచిపెట్టకుండానే చేస్తున్నారు. గ‌త సినిమా 'సంక్రాంతికి వ‌స్తున్నాం' తో ఏకంగా 300 కోట్ల క్ల‌బ్ లో కి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త్రివిక్ర‌మ్ తో సినిమా అంటే అంచ‌నాలు అదే స్థాయిలో ఉన్నాయి.

Tags:    

Similar News