విక్టరీ వెంకటేష్ వెయిటింగ్ అందుకేనా?
వాళ్లలో కొందర్ని సురేష్ బాబు రిజెక్ట్ చేయడంతో వెనక్కి వెళ్లిపోయారు.;
విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో 300 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి సినిమా విషయంలో వెంకీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ సినిమా చేసినా? అది హిట్ కంటెంట్ అవ్వాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నలుగురు స్టోరీలు కూడా చెప్పారు. వాళ్లలో కొందర్ని సురేష్ బాబు రిజెక్ట్ చేయడంతో వెనక్కి వెళ్లిపోయారు.
మరో ఇద్దరు దర్శకుల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో వెంకీ తదుపరి సినిమా దర్శకుడి విషయంలో సందిగ్దత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెంకీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా లీకైంది. వెంకటేష్ కొంత కాలంగా కాలినొప్పితో బాధపడుతున్నారుట. మోకాలి నొప్పి సమస్య ఉందని అందుకే విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటున్నారని అంటున్నారు. సాధారణంగా వెంకటేష్ కి విదేశాలకు వెకేషన్లకు వెళ్లడం అలవాటు.
సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పనిసరిగా వెకేషన్ కు వెళ్తుంటారు. కానీ సంక్రాంతి రిలీజ్ తర్వాత ఎలాంటి వెకేషన్లకు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉన్నారు. డాక్టర్లు విశ్రాంతి అవసరం అని సూచించ డంతో వెంకటేష్ ఇంటికి పరమితమయ్యారని సమాచారం. కొత్త సినిమా విషయంలో కూడా జాప్యం అందుకే జరుగుతుందని వినిపిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడానికి ఇంకా రెండు..మూడు నెలలు సమయం పడుతుందిట.
ఇప్పటివరకూ వెంకటేష్ నాలుగు ప్రొడక్షన్ హౌస్ లకు కమిట్ మెంట్లు ఇచ్చినట్లు సమాచారం. అందులో సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ మినహా ఇస్తే యూవీ క్రియేషన్స్, స్వప్నా సినిమాస్ సహా మరో సంస్థలో సినిమాలు చేయాల్సి ఉందిట. ముందుగా వెంకటేష్ బయట సంస్థల్లో కమిట్ మెంట్లు పూర్తి చేస్తారని సమాచారం. సంక్రాంతి సినిమా విజయం తర్వాత వెంకటేష్ పారితోషికం కూడా భారీగా పెంచేసారని వినిపిస్తుంది.