వెంకీ ఎందుకు స్పెషల్ అంటే..?

విక్టరీ వెంకటేష్ లాస్ట్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు.;

Update: 2026-01-13 04:23 GMT

విక్టరీ వెంకటేష్ లాస్ట్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సంక్రాంతికి ఆయన సినిమా లేదు కదా అనుకున్న ఫ్యాన్స్ కి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాతో సర్ ప్రైజ్ ఇచ్చాడు. అనిల్ రావిపూడి ఎలా వెంకీని ఎం.ఎస్.జి లో తీసుకొచ్చాడో కానీ సినిమాకు వెంకటేష్ కూడా అదనపు ఆకర్షణ అయ్యాడు. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉన్న వెంకటేష్ ఇలా మెగా బాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తెలుగు సినీ లవర్స్ కి సూపర్ జోష్ అందిస్తుంది.

మల్టీస్టారర్స్ కి వెంకటేష్ రెడీ..

వెంకటేష్ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో మల్టీస్టారర్స్ కి తాను రెడీ అనేశాడు. రామ్ తో కలిసి మసాలా సినిమా చేశాడు వెంకటేష్. ఆ సినిమా అంత గొప్ప రిజల్ట్ అందుకోలేదు. ఆ తర్వాత మహేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ ఇద్దరు స్టార్స్ గా కాకుండా జస్ట్ యాక్టర్స్ గా అలరించారు. ఇక పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమా చేసి ఆడియన్స్ ని మెప్పించారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి అదరగొట్టారు. సినిమాలో వెంకీ వచ్చేంత వరకు ఒక లెక్క అయితే వెంకటేష్ వచ్చాక చిరు, వెంకీ అలా ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ ని తెర మీద చూస్తుంటే ఇది కదా సినీ లవర్స్ కోరుకునేది అన్నట్టుగా ఉంది. వెంకటేష్ ఓ పక్క తన సోలో సినిమాలతో తన ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ హిట్ జోష్ మర్చిపోకముందే మన శంకర వరప్రసాద్ తో మళ్లీ మరో సూపర్ హిట్ ఇచ్చాడు.

ఎలాంటి ఈగో లేకుండా.. స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా..

వెంకటేష్ మాత్రమే ఇలా ఎలాంటి ఈగో లేకుండా ఎలాంటి రోల్ కి అయినా స్క్రీన్ స్పేస్ ఎంత తక్కువ ఉన్నా చేయగలడు. తన ఫ్యాన్ బేస్ తెలిసినా కూడా ఫ్యాన్స్ తనని ఎలా అయినా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకంతోనే వెంకీ సార్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. చిరుతో వెంకీ కలిసి చేసిన హంగామా ఎం.ఎస్.జి కి స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యింది.

మన శంకర వర ప్రసాద్ చూస్తుంటే చిరు, వెంకీ తో సాధ్యమైంది కాబట్టి బాలయ్య, నాగార్జున కూడా కలిసి ఇలా నలుగురు హీరోలు కలిసి అదరగొట్టే సినిమా వచ్చే ఛాన్స్ కూడా ఉందనిపిస్తుంది. అనిల్ రావిపూడికి ఆ కెపాసిటీ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. మరి అలాంటి క్రేజీ మల్టీస్టారర్ ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. అలాంటి సినిమా వస్తే మాత్రం ప్రతి తెలుగు సినీ అభిమాని ఆ సినిమాను పండగ చేసుకునే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News