వెంకటేష్ డబుల్ ధమాకా..100 రోజుల్లో 2 సినిమాలు!
విక్టరీ వెంకటేష్ రూటే సపరేట్ ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా బాక్సాఫీస్ హిట్లు కొట్టడం ఆయనకు మాత్రమే సాధ్యం.
విక్టరీ వెంకటేష్ రూటే సపరేట్ ఎలాంటి హడావుడి, ఆర్భాటం లేకుండా సైలెంట్‌గా బాక్సాఫీస్ హిట్లు కొట్టడం ఆయనకు మాత్రమే సాధ్యం. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకుని ఫుల్ ఫామ్‌లో ఉన్న వెంకీ.. ఇప్పుడు తన అభిమానులకు సరికొత్త డబుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. కేవలం 100 రోజుల గ్యాప్‌లోనే రెండు భారీ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తూ బాక్సాఫీస్ వద్ద డబుల్ ధమాకా సృష్టించబోతున్నారు. ఆ వివరాలు చూద్దాం..
దసరా బరిలో ఆదర్శ కుటుంబం:
వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. భారీ తారాగణం, ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న దసరా మరియు గాంధీ జయంతి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, వెంకీ టైమింగ్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయి.
సంక్రాంతి విందుగా ‘వెంకీ - అనిల్’ 5వ చిత్రం:
‘ఆదర్శ కుటుంబం’ విడుదలైన సరిగ్గా 100 రోజుల గ్యాప్‌తో వెంకటేష్ మరో భారీ సినిమాతో జనం ముందుకు రానున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో గురువారమే ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఎఫ్2, ఎఫ్3 లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఐదో సినిమా ఇది. ఈసారి నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తోడవడంతో థియేటర్లలో నవ్వుల పండగ గ్యారెంటీ అనిపిస్తోంది.
వంద రోజుల్లో 2 మూవీస్ :
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ కి జీవీ మ్యూజిక్ అందిస్తున్నాడు సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక వెంకటేష్ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాదిలో విడుదల కావడం, అందులో రెండు సినిమాలు కేవలం వంద రోజుల గ్యాప్‌లో రావడం ప్రత్యేకం.
వెంకటేష్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తుండటంతో అటు ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ థియేటర్ల యజమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక త్రివిక్రమ్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, అనిల్ రావిపూడి ఊరమాస్ కామెడీ మార్క్.. ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇక ఫుల్ ఫామ్ లో ఉన్న వెంకటేష్, రాబోయే దసరా, సంక్రాంతి సీజన్లను తన సినిమాలతో ఎలా రూల్ చేస్తారో చూడాలి.