• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ చైతన్య, శోభిత.....

నాగ చైతన్య, శోభిత.. గిఫ్ట్ అడిగిన వేణు స్వామి సతీమణి

| సెలబ్రెటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి భార్యగా కంటే ప్రముఖ వీణా వాయిదాకారిణిగా తెలుగు రాష్ట్రాలలో వీణాశ్రీవాణి మంచి గుర్తింపు అందుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-14 06:45 GMT

సెలబ్రెటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి భార్యగా కంటే ప్రముఖ వీణా వాయిదాకారిణిగా తెలుగు రాష్ట్రాలలో వీణాశ్రీవాణి మంచి గుర్తింపు అందుకున్నారు. ఈమె తన యుట్యూబ్ ఛానల్ లో రెగ్యులర్ గా వీణావాయిద్యంపై తెలుగు సినిమాల సాంగ్స్ ని ప్లే చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సంగీతకళాకారిణిగా వీణా శ్రీవాణిపై చాలా మందికి విశేషమైన గౌరవం ఉంది. ఆస్ట్రాలజర్ వేణు స్వామి మీద ఎన్ని రకాల ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో జరిగిన వీణశ్రీవాణి స్పందించలేదు.

సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ని ఆమె లైట్ తీసుకునేవారు. నెటిజన్లు కూడా వేణుస్వామిని టార్గెట్ చేసిన వీణాశ్రీవాణి జోలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. కేవలం ట్రోలింగ్, విమర్శలు అన్ని కూడా వేణు స్వామి చుట్టూనే తిరుగుతూ ఉండేవి. అయితే కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య, శోభిత నిశ్చితార్ధం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఆ మరుసటి రోజే వేణు స్వామి నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం గురించి తన జ్యోతిష్యం చెప్పారు.

ఇద్దరు మూడేళ్ళకి మించి కలిసుండరని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. వేణుస్వామి మీద మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. వాటికి సంబందించిన నోటీసులు కూడా వేణు స్వామి అందుకున్నారు. వేణు స్వామి అలా నాగ చైతన్య, శోభిత వైవాహిక బంధంపై ప్రెడిక్షన్ చెప్పడాన్ని చాలా మీడియా ఛానల్స్ తప్పు పట్టాయి. దీనిపై వేణు స్వామి భార్య వీణాశ్రీవాణి మొదటి సారి రియాక్ట్ అయ్యారు.

వేణు స్వామి మీద జరుగుతున్న విమర్శల దాడిని ఆమె ప్రశ్నిస్తూనే ఓ వర్గం మీడియా ధోరణిని తప్పు పట్టారు. చాలా అంశాలపై ఆ వీడియోలో వీణాశ్రీవాణి మాట్లాడారు. వీడియోలో వేణు స్వామి చేసిన పనిని ఆమె సమర్ధించలేదు. అలా అని వ్యతిరేకించలేదు. వీణాశ్రీవాణి షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా వీణాశ్రీవాణి మరో వీడియో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందులో నాగచైతన్య, శోభితకి అభినందనలు తెలియజేస్తూనే, నాకు మీరు గిఫ్ట్ ఇవ్వాలంటూ వీణాశ్రీవాణి కోరారు.

మీ నిశ్చితార్ధ వేడుకకి సంబందించిన న్యూస్ ని కొంతమంది డైవర్ట్ చేసి ఇతరులని టార్గెట్ చేయడానికి ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో మీరు కచ్చితంగా నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాల్సిందే… పెద్దగా ఏమీ అవసరం లేదు. లేటెస్ట్ ఎల్.వి బ్యాగ్ ఇస్తే సరిపోతుంది అంటూ వ్యంగ్యంగా ఆమె వీడియో పెట్టారు. వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై వీణా శ్రీవాణి తన ఆవేదనని పరోక్షంగా బయటపెట్టి ఉంటారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తం అవుతోంది.అసలు ఈమె నాగ చైతన్య ని గిఫ్ట్ అడగటం ఏమిటో జనాలకి అర్ధం కావడం లేదు.

Tags:    
  • Veenasrivani 
  • Venuswamy 
  • Tollywood 
  • Filmindustry 
  • Nagachaitanya 
  • Sobhithadulllipalla 
  • Gift 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS