• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ దర్శకుడితోనే మెగా 157.....

ఆ దర్శకుడితోనే మెగా 157.. ఆల్మోస్ట్ కన్ఫామ్

| చిరు.. బింబిసార్ ఫేమ్ యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-08-10 15:30 GMT

ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమాతో రానున్నారు. తమిళ సూపర్ హిట్ 'వేదాళం'కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం.. మరో రోజులో అభిమానుల ముందుకు రానుంది. అయితే గత కొద్ది రోజులుగా చిరు.. బింబిసార్ ఫేమ్ యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడా ప్రచారం దాదాపుగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ ఫిల్మ్ గా ఇది రాబోతుందని ఆ మధ్యలోనే కథనాలు వచ్చాయి. కథ నచ్చడంతో మెగాస్టార్.. సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపించింది.

ఇప్పుడీ చిత్రాన్ని మెగా 175 చిత్రంగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించనున్నారట. ప్రస్తుతం మరో సారి ఫైనల్ దశ చర్చలు జరిపి నవంబర్ నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

వాస్తవానికి 'బింబిసార' సినిమాతో వశిష్ట దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ ఫిల్మ్ గా వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకున్న వశిష్ట..ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తోనే బింబిసార-2 చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

అయితే అప్పుడెప్పుడో మూడు దశాబ్దాల క్రితం చిరు.. సోషియో ఫాంటసీ సినిమాలు 'యముడికి మొగుడు', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నారు. మరి ఇప్పుడు బింబిసార దర్శకుడి సినిమా అనుకున్నట్టే సెట్స్ పైకి వెళ్తే.. మరోసారి ఆ స్థాయి విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

ఇకపోతే భోళాశంకర్ తర్వాత మెగా 156 చిత్రంగా తన కూతురు కొణిదెల సుస్మిత నిర్మాణంతో ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఈ విషయాన్ని ఆ మధ్య సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ కూడా చేశారు చిరు. బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణతో ఈ సినిమా చేస్తున్నారు. ఇది మలయాళం సూపర్ హిట్ బ్రో డాడీకి రీమేక్ గా రానుంది. ఇందులో చిరుతో పాటు యంగ్ హీరో శర్వానంద్ నటిస్తారని ప్రచారం సాగుతోంది.

Tags:    
  • Vasishta 
  • Talenteddirector 
  • Bimbisara 
  • Chiranjeevi 
  • Mega157 
  • Bimbisara2 
  • Tollywood 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS