• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుణ్ 'మట్కా' టీజర్ ఔట్.....

వరుణ్ 'మట్కా' టీజర్ ఔట్.. ఎలా ఉందంటే?

| మెగా హీరో వరుణ్ తేజ్.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-05 10:41 GMT

మెగా హీరో వరుణ్ తేజ్.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్న ఆయన.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగం మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.

1960 బ్యాక్‌ డ్రాప్‌ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో మట్కా సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. వింటేజ్ విశాఖ నేపథ్యంతో తెరకెక్కుతున్న మట్కా చిత్రాన్ని నవంబర్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా శనివారం మధ్యాహ్నం విజయవాడలో టీజర్ రిలీజ్ చేశారు.

ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికి ఒక్కరే స్పందిస్తారు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు.. నాలాంటోళ్లు.. నువ్వు ఆ తొంభై పైసలు సంపాదించే ఒక్కడివి.. 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకు.. నీకు ఆ దమ్ము ఉంది.. అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తురావాలి లేదా బాస్ గుర్తు రావాలి అంటూ క్లాసీ లుక్ లో వరుణ్ ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత వరుసగా వరుణ్ మాస్, రెట్రో లుక్స్ ను రివీల్ చేశారు మేకర్స్. ధర్మం.. మనకు ఏది అవసరమో అదే ధర్మం.. మనుషుల ఆశ చావ నంత వరకు నా వ్యాపారానికి చావు ఉండదు.. అంటూ వేరే లెవెల్ డైలాగ్ తో రెట్రో లుక్ లో వరుణ్ అలరించారు. చివరలో అదిరిపోయే యాక్షన్ సీన్ తో టీజర్ ను కట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం మట్కా టీజర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంచి వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతోంది.

అయితే విభిన్నమైన రోల్స్ లో వరుణ్.. సినిమాలో మెప్పించనున్నట్లు టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. మూవీ కోసం ఆయన ఫుల్ మేకోవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పాత్రలో చితక్కొట్టేశారు. యాక్షన్ సీక్వెన్సుల్లో అయితే స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మీనాక్షీ చౌదరి క్యూట్ గా కనిపిస్తున్నారు. ఓవరాల్ గా టీజర్.. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది. మరి మట్కా మూవీ వరుణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Varuntej 
  • Matkateaser 
  • Norafatehi 
  • Meenakshichaudhary 
  • Varuntejmatka 
  • Gvprakashkumar 
  • Karunakumar 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS