• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుణ్ - లావణ్య పెళ్లి.....

వరుణ్ - లావణ్య పెళ్లి.. మొదటి సినిమాలోనే అలా..

| మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ - హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి తంతు ముగిసింది. ఇటలీలో గ్రాండ్​గా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు.

By - Tupaki Desk
Update: 2023-11-03 15:30 GMT

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ - హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి తంతు ముగిసింది. ఇటలీలో గ్రాండ్​గా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. వరుణ్ - లావణ్య కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వేడుక‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. అయితే లావణ్య పెళ్లి విషయంలో కొన్ని అనుకోకుండా జరిగిన కొన్ని విషయాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాళ్లోకి వెళితే.. ఆ మధ్య లావణ్యను ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న నిర్మాత అల్లు అరవింద్.. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది అని అనగా.. ఆమె నిజంగానే ఇప్పుడు తెలుగు కుర్రాడైన మెగా ప్రిన్ వరుణ్ తేజ్​ను పెళ్లి చేసుకుంది.

అయితే తాజాగా మరో సంఘటన జరిగింది. అల్లు అరవింద్ మాటల్లాగే ఇప్పుడు లావణ్య త్రిపాఠి జీవితంలో మరొకటి జరిగింది. గతంలో లావణ్య త్రిపాఠి నటించిన అందాల రాక్షసి సినిమాలోని ఓ సన్నివేశం.. ఈ పెళ్లికి సరిగ్గా సెట్ అవుతోంది. ఆ చిత్రంలో కొంతమంది పిల్లలు మాట్లాడుతూ.. లావణ్య అక్కా.. నీ పెళ్లికి సినిమా యాక్టర్స్ వస్తున్నారంటా కదా? అంటే నీ పెళ్లికి చిరంజీవి కూడా వస్తారా? అంటూ లావణ్యను అడుగుతారు.

అందుకు లావణ్య కూడా అవునని తల ఊపుతుంది. ఆ తర్వాత పిల్లలంతా ఆనందంతో గ్యాంగ్ లీడర్ వస్తున్నారంటూ సందడి చేస్తారు. ఆ సినిమా 2012లో వచ్చినప్పటికీ.. 2023లో నిజంగానే అదే సీన్ రిపీట్ అయింది. ఇప్పుడా దాన్ని అందరూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో జరగడం చాలా అరుదుగా చూస్తుంటాం. కాగా అందాల రాక్షసిని హను రాఘవపూడి తెరకెక్కించారు. ఇందులో నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలు పోషించారు.

Full View
Tags:    
  • Varunlavweeding 
  • MegaFamillyWedding 
  • Chiranjeevi 
  • Lavanya 
  • Itally 
  • Nagababu 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS