ఈ మూవీ మీదే ఫుల్ ఫోకస్

వరుణ్ తేజ్ ఈ సినిమా మీదే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే వరుస ఫ్లాపులతో కెరీర్ లో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి అన్న సందిగ్ధంలో మేర్పపాక గాంధి ఈ కథ చెప్పాడు.;

Update: 2025-07-22 02:58 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈమధ్య వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ లో చాలా వెనకపడ్డాడు. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అందరు చేస్తారు తను కాస్త కొత్తగా ఏదైనా ప్రయోగం చేద్దామనే కంచె నుంచి కొత్త కథలతో వస్తున్నాడు వరుణ్ తేజ్. కానీ అతని బ్యాడ్ లక్కేమో కానీ సినిమాలు మాత్రం ఏవి ఆశించిన స్థాయి ఫలితాలు ఇవ్వట్లేదు. ఐతే వరుణ్ తేజ్ ప్రస్తుతం తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్నాడు.

యువి క్రియేషన్స్ బ్యానర్, ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో అశోకవనంలో అర్జున కళ్యాణం హీరోయిన్ రితిక హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. థమన్ మ్యూజిక్ తో ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుందని తెలుస్తుంది.

వరుణ్ తేజ్ ఈ సినిమా మీదే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే వరుస ఫ్లాపులతో కెరీర్ లో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి అన్న సందిగ్ధంలో మేర్పపాక గాంధి ఈ కథ చెప్పాడు. హర్రర్ కామెడీతో వస్తున్న ఈ సినిమాలో కమెడియన్ సత్యకు కూడా మంచి రోల్ వచ్చిందని తెలుస్తుంది.

ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ఐతే సోషల్ మీదియాలో మాత్రం ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ ఈ సినిమా పూర్తయ్యే వరకు ప్రమోషనల్ కంటెంట్ దాచి ఉంచాలని చూస్తున్నాడట. సినిమా పూర్తయ్యాక ప్రమోషన్స్ కి మంచి ప్లానింగ్ చేద్దామని అనుకుంటున్నారట. ఈమధ్య సినిమాలు ప్రమోషన్స్ బాగా చేస్తేనే ఆడియన్స్ కు రీచ్ అవుతున్నాయి. అందుకే వరుణ్ తేజ్, మేర్లపాక గాంధి సినిమాలకు కూడా అదే పంథా ఫాలో అవ్వాలని చూస్తున్నారు.

ఐతే ఈ సినిమా పూర్తయ్యే వరకు వరుణ్ తేజ్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది కూడా ఫిక్స్ చేయరని తెలుస్తుంది. పూర్తిగా ఈ మూవీ మీదే ఫుల్ ఫోకస్ పెడుతున్నాడట. ఐతే వరుణ్ తేజ్ తో నెక్స్ట్ ఎవరి డైరెక్షన్ లో చేస్తాడన్న ఊహాగానాలు కూడా రావట్లేదు. మరి వరుణ్ తేజ్ ఈ ఇండో కొరియన్ హర్రర్ మూవీ ఎలాంటి హడావిడి చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News