రణ్ వీర్ డ్రెస్ ప్రభాస్ ధరించినట్లుంది.. వరుణ్ కొత్త సినిమా టీజర్

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్టు సినిమా సన్నీ సంస్కారి కి తులసి కుమారి. ఈ సినిమా శశాంక్ ఖైతాన్ తెరకెక్కించారు.;

Update: 2025-09-02 16:27 GMT

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్టు సినిమా సన్నీ సంస్కారి కి తులసి కుమారి. ఈ సినిమా శశాంక్ ఖైతాన్ తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 02న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ ఇటీవల టీజర్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ను బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సింపుల్ గా ఓ క్యాప్షన్ రాసుకొచ్చారు.

నలుగురు వ్యక్తులు, రెండు హార్ట్ బ్రేక్ లు, ఒక పెళ్లి అంటూ సినిమా స్టోరీని షార్ట్ కట్ లో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. నేను బాహుబలి లా ఉన్నానా అంటూ వరుణ్ డైలాగ్ తో టీజర్ ప్రారంభం అయ్యింది. దీనికి రిప్లైగా మరో నటుడు రోహిత్ సరాఫ్.. ప్రభాస్ డ్రెస్ ను రణ్ వీర్ ధరించినట్లు ఉంది అని చెబుతాడు.

కాగా, దర్శకుడు శశాంక్ ఖైతాన్.. వరుణ్ తో చేసిన ముూడో సినిమా ఇది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబోలో హంపీ శర్మ కి దుల్హానియా (2014), బద్రీనాథ్ కి దుల్హానియా (2017) సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు సైతం భారీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ రెండు విజయాల తర్వాత వరుణ్ దర్శకుడితో చేస్తున్న మూడవ ప్రాజెక్ట్ ఇది.

అయితే, సన్నీ సంస్కారి కి తులసి కుమారి సినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది. సరిగ్గా అదే కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతారా: ఎ లెజెండ్ - చాప్టర్ 1, హర్షవర్ధన్ రాణే ఏక్ దీవానే కి దీవానియాత్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలతో పోటీ పడనుంది. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ ధావన్ కామెడీ జానర్‌ లోకి తిరిగి రావడాన్ని వారు ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ సినిమాను అక్షయ్ ఒబెరాయ్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, సన్యా మల్హోత్రా, మనీష్ పాల్, రోహిత్ సరాఫ్ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో సినిమా కోసం మూనీ లవర్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News