జక్కన్న 'వారణాసి' టైమ్-ట్రావెల్ రహస్యం ఇదే!
కొన్ని ఊహాగానాల ప్రకారం ఈ సినిమా కేవలం భూమి మీదే కాకుండా భవిష్యత్తు కాలాల అన్వేషణతో ముడిపడి ఉండే అవకాశం లేకపోలేదు.
దర్శకశిఖరం రాజమౌళి తెరకెక్కిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం `వారణాసి` పై ప్రేక్షకుల్లో అంచనాలుఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మహేష్ సహా ఇతర పాత్రలుక్స్...ప్రచార చిత్రాలు..రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన లీక్స్ తో హైప్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. తాజాగా కార్తికేయ ఇచ్చిన హిట్స్ మరింత కాక పుట్టిస్తున్నాయి. ఈ సినిమా వివిధ కాలాల్లో సాగే ఒక అద్భుతమైన ఎపిక్ అడ్వెంచర్ డ్రామాగా ఉండబోతుందన్నారు.
దీంతో ఎపిక్ అడ్వెంచర్ నేపథ్యంలో కథ ఏఏ కాలాల్లో నడుస్తుందనే చర్చ ఊపందుకుంది. అందులో ప్రధానంగా ఈ సినిమా మూడు లేదా నాలుగు విభిన్న కాలాల చుట్టూ తిరిగే అవకాశం ఉందని కొం తమంది గెస్ చేస్తున్నారు. తొలి కాలం వేద కాలానికి సంబంధించినదై ఉండవచ్చు. ఈ కాలంలో మానవులకు, దైవిక శక్తులకు మధ్య నడిచే పోరాటాన్ని రాజమౌళి చూపించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.
అలాగే భారతీయ చరిత్రలో అత్యంత వైభవంగా వెలుగొందిన మధ్యయుగాల కాలం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో అప్పటి రాజులు, సామ్రాజ్యాలు , కోటల నేపథ్యంలో అడ్వెంచర్ సాగుతుంది. ముఖ్యంగా `వారణాసి` నగరానికి ఉన్న వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుంటే? పురాతన కాలం నుండి వస్తున్న ఒక రహస్యాన్ని కాపాడే క్రమంలో ఈ ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఇక మూడవది ప్రస్తుత కాలానికి కూడా ముడిపడి ఉంటుందని తెలుస్తోంది. ఆధునిక కాలంలో ఉండే సాధారణ సాహసికుడు గతం నుండి వస్తున్న పురాతన రహస్యాన్ని ఛేదించే ప్రయాణంలో ఈ కాలం కీలక పాత్ర పోషిస్తుంది. వర్తమాన కాలపు సాంకేతికత , పురాతన కాలపు మిస్టరీల కలయిక ఈ సినిమాకు ప్రధాన హైలైట్ కానుందని విశ్లే షకులు భావిస్తున్నారు.
కొన్ని ఊహాగానాల ప్రకారం ఈ సినిమా కేవలం భూమి మీదే కాకుండా భవిష్యత్తు కాలాల అన్వేషణతో ముడిపడి ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ప్రధానంగా పురాతన కాలపు ఆధ్యాత్మిక వేర్లు, చారిత్రక నేపథ్యం , ఆధునిక సాహస యాత్రల కలయికే ఈ ఎపిక్ అడ్వెంచర్ ప్రధాన ఆత్మగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రాజమౌళి తనదైన విజువల్ గ్రాండియర్ తో ఈ కాలాలన్నింటినీ ఒకదానితో ఒకటి ఎలా కలుపుతారనేది అత్యంత ఆసక్తికరం.
మొత్తానికి `వారణాసి`ఒక కాలానికి పరిమితం కాకుండా టైమ్-ట్రావెలింగ్ తరతరాలుగా ప్రయాణించే గొప్ప బాధ్యత ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ విజువల్ అద్భుతం ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచ వేదికపై నిలబెట్టడం ఖాయం.