'జైలర్ 2' ట్రైలర్.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

ట్రైలర్ లో రజినీకాంత్ మార్క్ వింటేజ్ స్వాగ్, స్టైల్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాయి. SJ సూర్య విద్యా బాలన్ క్యారెక్టర్లు కూడా హైలెట్ అయ్యాయి.

Update: 2026-10-05 14:23 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ కమ్ బ్యాక్ మూవీ 'జైలర్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న 'జైలర్ 2' తెలుగు ట్రైలర్ విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ ట్రైలర్ ఆడియన్స్ కు డీసెంట్ కిక్ ఇస్తోంది కానీ, ఫస్ట్ పార్ట్ రేంజ్ లో వావ్ ఫ్యాక్టర్ ను మాత్రం పూర్తిగా ఇవ్వలేకపోయిందనే టాక్ కూడా వినిపిస్తోంది.

కథను ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఆగిందో సరిగ్గా అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వర్మని చంపేసిన తర్వాత ముత్తువేల్ పాండియన్ చాటుగా బతకడం లేదని, డైరెక్ట్ గానే గ్రౌండ్ లోకి దిగుతున్నాడని డైలాగ్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ఈసారి విలన్లుగా ఎవరినీ బతకనివ్వని పవర్ఫుల్ 'కల్పాక్స్' గ్యాంగ్ ను రంగంలోకి దించారు.

ట్రైలర్ లో రజినీకాంత్ మార్క్ వింటేజ్ స్వాగ్, స్టైల్ ఎప్పటిలాగే ఆకట్టుకున్నాయి. SJ సూర్య విద్యా బాలన్ క్యారెక్టర్లు కూడా హైలెట్ అయ్యాయి. అయితే, ఎలివేషన్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ, ఫస్ట్ పార్ట్ లో చూసిన క్యారెక్టరైజేషన్ కావడంతో ఈసారి ఆ ఫ్రెష్ నెస్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. నెల్సన్ తన సిగ్నేచర్ డార్క్ హ్యూమర్ ను ఇందులోనూ కంటిన్యూ చేసినట్లు కనిపిస్తోంది.

శత్రువులందరినీ ఒకే చోటకి పిలిపించి అక్కడే బాంబు పెట్టటం తన స్టైల్ అంటూ ముత్తువేల్ పాండియన్ చెప్పే సీన్ నెల్సన్ మార్క్ టేకింగ్ హైలెట్ అయ్యింది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదని విజువల్స్ చెబుతున్నాయి. ట్రైలర్ చివర్లో యోగి బాబు "పాసంజర్లని చంపేసి కార్ తుడుచుకుంటున్నావా" అనే సీన్ తో రజినీలోని క్రేజీ యాటిట్యూడ్ ను బాగానే ఎలివేట్ చేశారు. ఇక స్పెషల్ క్యామియో పాత్రల్లో మళ్ళీ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కనిపించనున్నారు.

యాక్షన్ బ్లాక్స్ స్కేల్ పెంచినట్లు కనిపిస్తున్నా, కేవలం గన్స్, స్టైల్ మీదే కాకుండా సినిమాలో ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటేనే సీక్వెల్ సెట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవరాల్ గా 'జైలర్ 2' ట్రైలర్ పక్కా ఫ్యాన్ స్టఫ్ తో నిండిపోయి డీసెంట్ బజ్ క్రియేట్ చేసింది. రజినీ స్వాగ్ కు అనిరుధ్ మ్యూజిక్ తోడైతే థియేటర్లలో హడావుడి ఉండటం గ్యారెంటీ. అయితే కేవలం ఎలివేషన్స్ కే పరిమితం కాకుండా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర టైగర్ రేంజ్ మళ్లీ మారుతుంది. ప్రేక్షకులను సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

Full View
Tags:    

Similar News