ఆదర్శ కుటుంబం ట్విస్ట్.. అనకాపల్లికి కలిసొచ్చేలా...

నిజానికి ఈ సినిమాకు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద అదృష్టం తలుపు తట్టింది. అక్టోబర్ 9న రావాల్సిన విక్టరీ వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47' సినిమా ట్విస్ట్ ఇచ్చింది.

Update: 2026-10-05 12:30 GMT

గత వారం బాక్సాఫీస్ బరిలో దిగిన సినిమాల్లో 'అనకాపల్లి' కొంచెం బెటర్ గా నిలబడింది. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్ బాగుండటంతో ఫస్ట్ డే నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ కు థియేటర్ల దగ్గర మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా క్లైమాక్స్ గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. ఇదే బజ్ కంటిన్యూ అయితే వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక హీరో విక్రమ్ సాహిదేవ్ కు ఈ సినిమా ఒక మంచి లాంచింగ్ ప్యాడ్ లా సెట్ అయింది. తన భుజాల మీదే కథను నడిపించినా ఎక్కడా ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సెటిల్డ్ గా నటించాడనే ప్రశంసలు దక్కుతున్నాయి. సంధ్య వశిష్ఠతో వచ్చే సీన్స్, అలానే డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబోలో వచ్చే ఎపిసోడ్స్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఎమోషనల్ ట్రాక్ లో విక్రమ్ చేసిన పర్ఫార్మెన్స్ తో ఇండస్ట్రీలో ఒక ప్రామిసింగ్ హీరోగా రిజిస్టర్ అయ్యాడు.

నిజానికి ఈ సినిమాకు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద అదృష్టం తలుపు తట్టింది. అక్టోబర్ 9న రావాల్సిన విక్టరీ వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నం.47' సినిమా ట్విస్ట్ ఇచ్చింది. సడెన్ గా వాయిదా పడింది. అదే గనుక రిలీజ్ ఉంటే థియేటర్లన్నీ ఆ పెద్ద సినిమాకే వెళ్లిపోయేవి. ఇప్పుడు ఆ డేట్ ఖాళీ అవ్వడంతో ఈ వారం రిలీజైన చిన్న సినిమాలకు మరో వారం పాటు థియేటర్లలో రన్ దొరికినట్లే.

ఈ వారం రిలీజైన మిగతా సినిమాలు సిగ్మా, తెల్లకాగితం, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లకు మిక్స్డ్ టాక్ రావడంతో అనకాపల్లికి బాగా కలిసొచ్చింది. ఆ సినిమాలతో పోలిస్తే అనకాపల్లికే బెటర్ రిపోర్ట్స్ ఉండటంతో ఎగ్జిబిటర్లు కూడా ఈ సినిమా షోలు కంటిన్యూ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఇలాంటి రూటెడ్ ఎమోషనల్ స్టోరీలకు కనెక్ట్ అయితే లాంగ్ రన్ గ్యారెంటీ.

పోటీ లేకపోవడం అనేది పక్కాగా బలాన్నిచ్చేదే. ఈ వీకెండ్ లో ఆక్యుపెన్సీ స్టెడీగా మెయింటైన్ చేస్తే చాలు, నెక్స్ట్ వీక్ కూడా థియేటర్లలో డీసెంట్ గా నెట్టుకురావచ్చు. ఎలాగూ బడ్జెట్ తక్కువే కాబట్టి, థియేటర్లో ఆడే ప్రతి రోజు నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చేదే. ఇప్పుడు మేకర్స్ చేయాల్సిందల్లా ప్రమోషన్ల డోస్ పెంచడమే. క్లైమాక్స్ ఎమోషన్ ను, హీరో విక్రమ్ యాక్టింగ్ ను హైలైట్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ వారం దొరికిన గ్యాప్ ను కరెక్ట్ గా వాడుకుంటే, అనకాపల్లి టీమ్ బాక్సాఫీస్ దగ్గర మరిన్ని కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News