'అనకాపల్లి' ప్రమోషన్స్ లో స్మార్ట్ టర్న్!

చిన్న సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీలు చాలా అవసరం. ముందుగా ట్రైలర్ లో మాస్ యాంగిల్ చూపించి ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఒక ఎత్తు.

Update: 2026-10-05 14:18 GMT

రిలీజ్ కు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే 'అనకాపల్లి' పక్కా లోకల్ రస్టిక్ యాక్షన్ డ్రామా అనే ఫీలింగ్ కలిగింది. హీరో రఫ్ లుక్, గొడవలు అన్నీ కూడా ఒక మాస్ బ్యాక్ డ్రాప్ నే హైలైట్ చేశాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక అసలు విషయం బయటపడింది. జనాలు సినిమాలోని యాక్షన్ కంటే అందులోని ప్రేమ, త్యాగం లాంటి ఎమోషనల్ పాయింట్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఆడియన్స్ పల్స్ పట్టుకున్న మూవీ టీమ్ వెంటనే తమ ప్రమోషన్ స్టైల్ ను పూర్తిగా మార్చేసింది.

లేటెస్ట్ గా సోమవారం షోలను ఉద్దేశించి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కొన్ని ప్రేమకథలు పెళ్లితో పూర్తవుతాయి... కొన్ని త్యాగంతో పవిత్రమవుతాయి అనే కొటేషన్ ను ఈ పోస్టర్ లో హైలెట్ గా వాడారు. అసలు కథలోని ఈ మెయిన్ ఎమోషన్ ను రిలీజ్ కు ముందు ఎక్కడా రివీల్ చేయకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ను బట్టి అదే పాయింట్ ను తమ పబ్లిసిటీకి వాడుకుంటున్నారు.

చిన్న సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీలు చాలా అవసరం. ముందుగా ట్రైలర్ లో మాస్ యాంగిల్ చూపించి ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడం ఒక ఎత్తు. ఆ తర్వాత జనాలు ఏ పాయింట్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారో గమనించి ప్రమోషన్స్ ను అటువైపు తిప్పడం మరో ఎత్తు. అనకాపల్లి మేకర్స్ సరిగ్గా ఇదే ప్లాన్ ఫాలో అవుతున్నారు. అందుకే ఈ కొత్త పోస్టర్ లో హీరో యాంగ్రీ లుక్ తో పాటు హీరోయిన్, ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా చూపిస్తూ ఇదొక స్వచ్ఛమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనే వైబ్ తీసుకొచ్చారు.

దీనికి తోడు సోమవారం షోలకు కూడా థియేటర్ల దగ్గర డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపిస్తుండటంతో చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. మండే షోలకు కూడా అదే ప్రేమ, అదే రెస్పాన్స్ వస్తోందని వాళ్లు పోస్టర్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక చిన్న సినిమాకు వీకెండ్ తర్వాత వర్కింగ్ డే రోజున ఇలా జనాలు రావడం అంటే కంటెంట్ టార్గెట్ ఆడియన్స్ కు రీచ్ అయినట్లే లెక్క.

ఈ తరహా ప్రమోషన్స్ వల్ల హీరో విక్రమ్ సాహిదేవ్ కు కూడా ఇండస్ట్రీలో ఒక కొత్త ఇమేజ్ వస్తోంది. ఫైట్లు మాత్రమే కాదు బరువైన ఎమోషనల్ సీన్స్ కూడా చాలా సెటిల్డ్ గా హ్యాండిల్ చేయగలడనే అప్రిసియేషన్ దక్కుతోంది. రాబోయే రోజుల్లో థియేటర్ల నుంచి వస్తున్న అప్డేట్స్ ను బట్టి అనకాపల్లి టీమ్ బాక్సాఫీస్ దగ్గర మరింత బజ్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News