రవితేజతో ఆత్రేయ మార్క్ మైండ్ గేమ్.. క్లారిటీ వచ్చేసిందిగా..

ఇక్కడే వివేక్ ఆత్రేయ మార్క్ కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఆయన సినిమాల్లో కథ కంటే స్టోరీని చెప్పే విధానం చాలా స్పెషల్ గా ఉంటుంది.

Update: 2026-10-05 14:22 GMT

మాస్ మహారాజా రవితేజను ఇప్పటివరకు మాస్ యాంగిల్‌ లోనే ఎక్కువగా చూశాం. కానీ ఈసారి ఆయనను డిఫరెంట్‌ గా చూపించేందుకు దర్శకుడు వివేక్ ఆత్రేయ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ కావడంతో అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందనే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది.

బ్లాక్ అండ్ వైట్‌ లో ఉన్న ఆ పోస్టర్ మొదటి చూపులోనే సినిమా మూడ్‌ ను చెప్పేస్తోంది. చీకటిలో ఒక వ్యక్తి ఒంటరిగా నడుస్తూ కనిపించడం.. చుట్టూ పొగ, నీడలు.. మొత్తం పోస్టర్‌ లో ఓ మిస్టరీ ఫీల్ కనిపిస్తోంది. ముఖ్యంగా వెనుక నుంచి చూపించిన రవితేజ లుక్ చాలా ఇంటెన్స్‌ గా ఉంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో కనిపించే ఫుల్ ఎనర్జీకి భిన్నంగా ఆ పోస్టర్ ఆయన రోల్ లో ఏదో సీక్రెట్ ఉందనే ఫీలింగ్ ఇస్తోంది.

ఇక్కడే వివేక్ ఆత్రేయ మార్క్ కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఆయన సినిమాల్లో కథ కంటే స్టోరీని చెప్పే విధానం చాలా స్పెషల్ గా ఉంటుంది. చిన్న విషయాలను కూడా స్క్రీన్‌ ప్లేలో కీలకంగా మలిచే స్టైల్ ఆయనది. ఇప్పుడు అలాంటి దర్శకుడికి రవితేజ లాంటి మాస్ హీరో తోడవ్వడంతో ఆ కాంబినేషన్‌ పై హైప్ పెరుగుతోంది. ఆ ప్రాజెక్ట్ కేవలం రొటీన్ మాస్ ఎంటర్టైనర్ కాదనే ప్రచారం ఇప్పటికే ఉంది.

హారర్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో కథ సాగుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంటే నవ్విస్తూనే భయపెట్టే సీన్స్‌ తోపాటు కథలో మైండ్ గేమ్ కూడా కీలకంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రవితేజను ఈ తరహా కథలో ఎలా చూపిస్తారనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆయన కామెడీ టైమింగ్‌ కు వివేక్ ఆత్రేయ స్క్రీన్‌ప్లే కలిస్తే సినిమా చాలా కొత్తగా ఉండొచ్చనే అంచనాలు మొదలయ్యాయి.

పోస్టర్‌ లో కూడా హీరో క్యారెక్టర్‌ ను పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం ఓ సిల్హౌట్‌ గా చూపించడం దీనికి మరింత స్ట్రెంత్ చేకూరుస్తోంది. ఇక సినిమాకు ‘తులా భారం అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టైటిల్ కూడా నార్మల్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

మరోవైపు దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పటికే కథ, స్క్రీన్‌ ప్లే పనులు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సమయంలో ఆ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇక అనౌన్స్మెంట్ పోస్టర్‌ తోనే సినిమా మూడ్ ఏంటో చెప్పేశారు! రవితేజ మాస్ ఇమేజ్‌ కు వివేక్ ఆత్రేయ మార్క్ మైండ్ గేమ్ యాడ్ అయితే.. ఆ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీగా నిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News