'కాక'లో అనురాగ్ కశ్యప్ పాత్ర వెనుక అసలు కథేంటి?
సాధారణంగా అనురాగ్ కశ్యప్ నటుడిగా ఒప్పుకునే పాత్రలు చాలా విభిన్నంగా, సైకోటిక్ , గ్రే షేడ్స్‌తో కూడుకుని ఉంటాయి.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో మరో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `కాక`తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ అధికారికంగా అడుగుపెట్టడంతో టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త అలజడి మొదలైంది. బాబీ కథ వివరిస్తుంటే కశ్యప్ లీనమై వింటున్న వర్కింగ్ స్టిల్ విడుదలైన క్షణం నుంచే చిత్రంలో ఆయన ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.
సాధారణంగా అనురాగ్ కశ్యప్ నటుడిగా ఒప్పుకునే పాత్రలు చాలా విభిన్నంగా, సైకోటిక్ , గ్రే షేడ్స్‌తో కూడుకుని ఉంటాయి. `ఇమైక్క నొడిగల్` (తెలుగులో అంజలి సీబీఐ) చిత్రంలో ఆయన పోషించిన సైకో కిల్లర్ పాత్ర దక్షిణాది ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది. తాజాగా `కాక` చిత్రంలోనూ ఆయన చిరంజీవికి సరిసమానమైన డార్క్ అండ్ పవర్‌ఫుల్ విలనిజం ఉన్న పాత్రలోనే కనిపించే అవకాశాలన్నాయని తెలుస్తోంది. మెగాస్టార్‌ను రఫ్ అండ్ టఫ్‌గా చూపించడంలో సిద్ధహస్తుడైన బాబీ ఆయనకు పోటీగా నిలిచే ప్రతి నాయకుడి పాత్రను అంతే పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసి ఉంటారని టాక్.
`కాక` అనే రఫ్ మాస్ టైటిల్ పెట్టడం.. బ్లడీ బెంచ్‌మార్క్ యాక్షన్ ఫిల్మ్ అని మేకర్స్ ప్రకటించడంతో ఇందులో నేర సామ్రాజ్య నేపథ్యంలో సాగే మైండ్ గేమ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. అనురాగ్ కశ్యప్ సాధారణ విలన్‌గా కాకుండా కథను మలుపు తిప్పే అండర్‌వరల్డ్ మాఫియా డాన్‌గా లేదా తెలివైన నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించే అవకాశం ఉంది. చిరంజీవి యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌కి, అనురాగ్ కశ్యప్ రా అండ్ రస్టిక్ యాక్టింగ్‌కి మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు వెండితెరపై మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్‌లా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.
మరోవైపు ఇది విలన్ పాత్ర మాత్రమే కాదని.. కథలో హీరోకి అత్యంత కీలకమైన సలహాదారుడిగా .. ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్ కావచ్చు అనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా? చిరంజీవి వంటి మాస్ ఐకాన్ సరసన సీరియస్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించగల నటుడు కావాలనే ఉద్దేశంతోనే బాబీ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం ద్వితీయార్థం షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతున్న ఈ షెడ్యూల్‌లో అనురాగ్ కశ్యప్ పాల్గొంటున్నారు. విలన్ పాత్రలను ఇన్నో వేటివ్ గా డిజైన్ చేయడం బాబి ప్రత్యేకత. ఆయన గత చిత్రాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్ పుల్ గా లాంచ్ అయ్యాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ లాంటి నటుడి విషయంలో బాబి మరింత కేరింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.