• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నెటిజ‌నుల కామెంట్ల‌కు...

నెటిజ‌నుల కామెంట్ల‌కు వ‌ర‌ల‌క్ష్మి కౌంట‌ర్!

| వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-04-29 03:30 GMT

వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. అప్ప‌టి నుండి వ‌రూపై అనూహ్య‌మైన ట్రోలింగ్ మొద‌లైంది. అత‌డి రూపం గురించి ఆన్ లైన్ లో చాలా కామెంట్లు క‌నిపిస్తున్నాయి. అప్ప‌టికే పెళ్ల‌యి పిల్ల‌లు ఉన్న‌వాడిని వ‌ర‌ల‌క్ష్మి పెళ్లాడుతుండ‌టంపైనా కొంద‌రు నెటిజ‌నులు అసహ్యకరమైన కామెంట్లు చేయ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వీట‌న్నిటికీ వ‌రూ త‌న‌దైన శైలిలో జ‌వాబులిచ్చింది. వరలక్ష్మి తన తండ్రి కూడా ``రెండుసార్లు వివాహం చేసుకున్నారు.. ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోన``ని చెప్పి ట్రోలర్ల‌కు జ‌వాబిచ్చింది.

అయితే నెటిజ‌నుల వ్యాఖ్య‌ల గురించి వ‌ర‌ల‌క్ష్మిని తాజాగా గ‌లాట్టా మీడియా ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించారు. దానికి వ‌ర‌ల‌క్ష్మి ఎంతో హుందాగా స్పందించారు. ``మా నాన్న కూడా రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న‌ సంతోషంగా ఉన్నంత వరకు తప్పు లేదు. నిక్ (కాబోయే భ‌ర్త నికోల‌స్) గురించి ప్రజలు సామాజిక మాధ్య‌మాల్లో ఎలా మాట్లాడుతున్నారో నేను చూశాను. అతడు నా దృష్టిలో అందంగా ఉన్నాడు! అని వరలక్ష్మి గలాటా తమిళ్‌తో అన్నారు. మా రిలేషన్ షిప్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసే వ్యక్తులను నేను పట్టించుకోను. ఎవరికైనా ఎందుకు సమాధానం చెప్పాలి.. మొదటి నుంచీ నేను అలా చేయడం మానుకున్నాను! అని చెప్పింది. నికోల‌స్ ఇంత‌కుముందు ప్ర‌ముఖ‌ మోడ‌ల్ క‌విత‌ను వివాహ‌మాడారు. ఈ జంట‌కు వెయిట్ లిఫ్ట‌ర్ గా రాణిస్తున్న కుమార్తె ఉంది. అయితే ఈ జంట విభేధాల‌తో 2019లో విడాకులు తీసుకున్నారు.

అయితే త‌న‌కు కాబోయే భర్త నికోలాయ్ మొదటి భార్య క‌విత‌తో స్నేహపూర్వకంగా ఉన్నానని వ‌ర‌ల‌క్ష్మి తాజా ఇంట‌ర్వ్యూలో స్పష్టం చేసారు. అతడి కుటుంబం గురించిన వివరాలను వెల్ల‌డిస్తూ.. వరలక్ష్మి నిక్ తల్లిదండ్రులు ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు. అతడు, అతని కుమార్తె పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతక విజేతలు. నేను అతడి మాజీ భార్యతో స్నేహంగా ఉంటాను. ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మ‌హిళ‌. అంద‌రితో అంతా బాగానే ఉంది! అని అన్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్, నికోలాయ్ సచ్‌దేవ్‌లు గత 14 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. అయితే ఇటీవలే వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. నికోలాయ్ నార్వే వెకేష‌న్‌లో ఉన్న‌ప్పుడు వ‌రూకి ప్రపోజ్ చేసాడు. వ‌ర‌ల‌క్ష్మి తండ్రి శరత్‌కుమార్, సవతి తల్లి రాధికను కూడా ఈ కార్య‌క్రమానికి వారు ఆహ్వానించారు.

నికోలాయ్ గురించి వరలక్ష్మి ఇలా అన్నారు, ``అతను నన్ను నవ్విస్తాడు.. నా కెరీర్‌కు మద్దతు ఇస్తాడు.. ఎల్లప్పుడూ నా దృష్టిలో మొదటి స్థానంలో ఉంటాడు. అతడు నన్ను చాలా ప్రేమగా, విలాసంగా.. గొప్ప‌గా రక్షించేవాడు. మేము ఆహారం విషయంలో ప్రేమను పంచుకుంటాము.. మేము 14 సంవత్సరాల క్రితం కలిశాము.. తక్షణమే ఏదో మాధ్య మొద‌లైంది. కానీ మేము అప్పటికి డేటింగ్ చేయలేదు.. మేము స్నేహితులుగా సన్నిహితంగా ఉన్నాము.. ఇటీవలే ప్రేమ వికసించింది...`` అని తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... వ‌ర‌ల‌క్ష్మి ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీ ఆర్టిస్టు. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో అద్భుతంగా రాణిస్తోంది. విల‌న్ గా, అలాగే అక్క లేదా చెల్లి పాత్ర‌ల్లోను న‌టించి మెప్పిస్తోంది. ధనుష్ `రాయాన్`లో వ‌ర‌ల‌క్ష్మి కీల‌క పాత్ర పోషిస్తోంది. మలయాళ చిత్రం `కలర్స్`.. తెలుగు చిత్రం `శబరి`లో కూడా కనిపించనుంది.

Tags:    
  • Kollywood 
  • Filmindsutry 
  • Marriage 
  • Husband 
  • Trolling 
  • Nicholaisachdev 
  • Varalakshmisarathkumar 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS