త్రిష పొలిటికల్ ఎంట్రీపై వనితా విజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత దళపతి విజయ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్‌తో ప్రేమాయణంలో ఉందంటూ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న స్టార్ బ్యూటీ త్రిష కూడా రాజకీయాల్లోకి రాబోతుందనే టాక్ నెట్టింట ఊపందుకుంది. ఈ క్రేజీ టాపిక్‌పై ప్రముఖ నటి వనితా విజయకుమార్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇలా వున్నాయి..
జయలలిత లాగే త్రిష కూడా:
త్రిష రాజకీయ ప్రవేశంపై వనితా విజయకుమార్ చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. "త్రిష పాలిటిక్స్‌లోకి వస్తే తప్పేంటి? ఒక లీడర్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఆమెకు ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మేడమ్ చదివిన చర్చ్ పార్క్ స్కూల్‌లోనే త్రిష కూడా చదువుకుంది. ఇక ఆమె బాగా చదువుకున్న అమ్మాయి, సమాజంపై మంచి అవగాహన ఉంది. చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలదు. ప్రజలను ఎలా గౌరవించాలో త్రిషకు బాగా తెలుసు. రాజకీయాల్లో ఆమెలాంటి మహిళలు ఉంటే చాలా మంచిది" అని వనిత పేర్కొన్నారు.
విజయ్, త్రిష రిలేషన్‌పై ఏమన్నారంటే?:
ఇక విజయ్, త్రిషల మధ్య ఉన్న రిలేషన్‌షిప్ పుకార్లపై కూడా వనిత ఓపెన్‌గా స్పందించారు. "వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బంధం నిజమైతే.. వాళ్లే దాన్ని ఓపెన్ గా ప్రకటిస్తారు. అందులో దాచడానికి ఏముంది? వాళ్లేమీ తప్పు చేయడం లేదు కదా!" అంటూ డేటింగ్ వార్తలపై వనిత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇక విజయ్ పార్టీ అయిన టీవీకే తరఫున త్రిష అభ్యర్థిగా పోటీ చేయనుందనే ప్రచారానికి వనిత మాటలు మరింత బలాన్ని చేకూర్చాయి.
సక్సెస్ జోష్‌లో త్రిష:
మరోవైపు త్రిష ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది. సూర్య సరసన ఆమె నటించిన కరుప్పు సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో పాటు, అటు తన బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ముఖ్యమంత్రి కావడంతో త్రిష డబుల్ జోష్‌లో ఉంది. ఇక ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మరియు పొలిటికల్ ఎంట్రీ రూమర్స్‌పై త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
త్రిష రాజకీయాల్లోకి రావడంపై నెట్టింట ఇంతలా చర్చ జరుగుతున్నప్పటికీ, దీనిపై అటు విజయ్ పార్టీ నుండి కానీ, ఇటు త్రిష నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతానికైతే ఇది కేవలం సోషల్ మీడియా టాక్ మాత్రమే. ఒకవేళ నిజంగానే త్రిష పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం తమిళ రాజకీయాల్లో సరికొత్త గ్లామర్ అండ్ పవర్ యాడ్ అవ్వడం ఖాయం.