నంది అవార్డులు.. క్లారిటీ ఇచ్చినా ఏం లాభం?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల టాలెంట్ కు గుర్తింపుగా నిలిచే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల్లో నంది అవార్డులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయని చెప్పాలి.;

Update: 2026-02-25 09:10 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల టాలెంట్ కు గుర్తింపుగా నిలిచే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాల్లో నంది అవార్డులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయని చెప్పాలి. రాష్ట్ర సర్కార్ ఇచ్చే ఆ అవార్డు అందుకోవడం.. ప్రతి యాక్టర్, డైరెక్టర్, టెక్నీషియన్ డ్రీమ్ గా భావిస్తారు. అలాంటి అవార్డులపై నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల జరిగిన సంప్రదాయని సుప్పిని శుద్ధపూసని సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ లో వంశీ నందిపాటి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన సీనియర్ నటి లయ నటనను ప్రశంసిస్తూ, ఆమె గతంలో వరుసగా నంది అవార్డులు అందుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే, అదే సందర్భంలో ఆయన ఉపయోగించిన ఒక పదం ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది.

లయ కెరీర్‌ లో ఎన్నో విజయాలు సాధించారని, ఆమె నటించిన సినిమాలకు వరుసగా అవార్డులు వచ్చాయని చెప్పే క్రమంలో వంశీ నందిపాటి ప్రాస కోసం ఒక పోలిక వాడారు. కానీ ఆ పోలికలో వచ్చిన పందులు అనే పదం అవార్డుల గౌరవాన్ని తగ్గించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేదికపై ఉన్న గెస్ట్ లు, మీడియా ప్రతినిధులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు!

దీంతో హోస్ట్ వెంటనే స్పందిస్తూ, "మీరు చెప్పిన సామెత అర్థం కాలేదు" అని ప్రశ్నించగా, వంశీ నందిపాటి తన ఉద్దేశం తప్పుగా అర్థమైందని వివరణ ఇచ్చారు. "లయకు చాలా ఎక్కువగా నంది అవార్డులు వచ్చాయి అని చెప్పడానికి మాత్రమే అలా అన్నాను. ఆమె ప్రతిభను పొగిడేందుకే ఆ మాట వాడా" అని తెలిపారు. అయినప్పటికీ ఆ క్లారిటీ సరిపోలేదు!

ఏదేమైనా నంది అవార్డు అనేది కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, అది ఆర్టిస్టుల కృషికి గుర్తింపుగా ఇచ్చే చిహ్నం. ఇలాంటి పురస్కారాన్ని జంతువులతో పోల్చడం సరికాదని అనేక మంది సినీ అభిమానులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్ ఈవెంట్లలో మాట్లాడేటప్పుడు సెలబ్రిటీలు సంయమనం పాటించాలని, ముఖ్యంగా అవార్డుల గురించి జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నారు.

మరోవైపు కొందరు మాత్రం వంశీ ఉద్దేశం తప్పుగా లేదని, అది కేవలం ఫన్నీ కామెంట్ మాత్రమేనని చెబుతున్నారు. అయినప్పటికీ పదాల ఎంపికలో జాగ్రత్త అవసరమనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ నటి లయను గౌరవించే సందర్భంలో ఇలాంటి మాటలు అవసరం లేదని చాలామంది పేర్కొంటున్నారు. ఏదేమైనా ప్రశంసించాలన్న ఉద్దేశంతో చేసిన వ్యాఖ్య ఇప్పుడు వివాదానికి దారి తీసింది. ఆ తర్వాత క్లారిటీ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. మరి ఈ విషయంపై వంశీ నందిపాటి మళ్లీ స్పష్టత ఇస్తారేమో వేచి చూడాలి.

Tags:    

Similar News