బేబీ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

సినిమాలు ఎలాగు లేట్ అవుతున్నాయని వైష్ణవి చైతన్య ఈమధ్య సోషల్ మీడియాలో జోరు పెంచింది.;

Update: 2025-05-01 23:30 GMT

షార్ట్ ఫిలిమ్స్ తో మెప్పించిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చింది. బేబీ సినిమాతో అమ్మడు లీడ్ రోల్ ఛాన్స్ అందుకోగా అది కాస్త సూపర్ హిట్ అయ్యింది. బేబీ హిట్ పడటంతో వైష్ణవికి వరుస ఛాన్స్ లు వచ్చాయి. ఆశీష్ తో లవ్ మీ సినిమా చేసిన అమ్మడు ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో కాస్త కంగారు పడింది. ఐతే సిద్ధుతో జాక్ సినిమా ఒడ్డున పడేస్తుందని భావించగా అది కూడా తుస్సుమన్నది.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన జాక్ సినిమా ఎలా వచ్చిందో అలానే వెళ్లింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య మరో ఫెయిల్యూర్ సినిమా తన ఖాతాలో వేసుకుంది. లవ్ మీ సినిమా పోయినా జాక్ తనను కాపాడుతుందని భావించిన వైష్ణవి చైతన్యకు పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.

వరుసగా రెండు సినిమాలు నిరాశ పరిస్తే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కైనా ఛాన్స్ లు రావడం కష్టం అలాంటిది వైష్ణవి చైతన్యకు ఇక మీదట అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి. ముఖ్యంగా అమ్మడు ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా అన్నట్టు కాకుండా పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తే బెటర్ అని ఆడియన్స్ భావిస్తున్నారు. అలాంటి సినిమాల వల్లే కొన్నాళ్లు కెరీర్ సాఫీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

అలా కాకుండా అవకాశం రావడమే ఎక్కువ అనుకుంటూ ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే మాత్రం ఇలానే కెరీర్ బ్రేకులు పడుతూ వస్తుంది. వైష్ణవి చైతన్య నెక్స్ట్ హిట్ పడే వరకు కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సినిమాలు ఎలాగు లేట్ అవుతున్నాయని వైష్ణవి చైతన్య ఈమధ్య సోషల్ మీడియాలో జోరు పెంచింది. తన టీం తో తన ఫోటో షూట్స్ ని ఎప్పటికప్పుడు ట్రెండ్ చేస్తూ ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది అమ్మడు. తెలుగు అమ్మాయిగా ముందు యూట్యూబ్ సీరీస్ లు సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన వైష్ణవి చైతన్య బేబీతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినా కూడా ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు నిరాశపరచడంతో అమ్మడి నెక్స్ట్ సినిమాలు ఆమె కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా మారాయి.

Tags:    

Similar News