'శశిరేఖ' ప్రోమో వచ్చేసింది.. చిరు నయన్ షైనింగ్ లుక్స్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ మన శంకర వరప్రసాద్ గారు.;

Update: 2025-12-06 06:35 GMT

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ మన శంకర వరప్రసాద్ గారు. స్టార్ హీరోయిన్ నయనతార ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఆ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అవ్వనుంది.

ఇప్పటికే సినిమాపై ఆడియన్స్, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. మేకర్స్ వాటిని పెంచుకుంటూ పోతున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల.. మ్యాసివ్ రెస్పాన్స్ అందుకుంది. ఏకంగా 76 మిలియన్ వ్యూస్ ను అందుకుని ఓ రేంజ్ లో అందరినీ ఇప్పటికీ అలరిస్తోంది.

ఆ మీసాల పిల్ల పాటకు వచ్చిన రెస్పాన్స్ తో ఫుల్ జోష్ లో మన శంకర వరప్రసాద్ గారు మేకర్స్.. ఇప్పుడు సినిమా నుంచి సెకెండ్ సింగిల్ శశిరేఖా... అంటూ సాగనున్న మెలోడీ పాటను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 8వ తేదీన సాంగ్ రిలీజ్ కానుండగా.. తాజాగా సోషల్ మీడియాలో ప్రోమో విడుదల చేశారు.

ప్రస్తుతం నెట్టింట ప్రోమో అందరినీ ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. శశిరేఖా అంటూ చిరు పడవపై రాగా.. మరో పడవపై ప్రసాదూ.. అంటూ నయనతార వచ్చారు. ఆ తర్వాత క్రేజీ మ్యూజిక్ వస్తుండగా.. ప్రోమో ఎండ్ అయింది. అయితే సాంగ్ లో చిరు, నయన్.. ట్రెడిషనల్ వేర్ లో అదిరిపోయేలా ఉన్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

విజువల్స్ చాలా బాగున్నాయి. చుట్టూ చెట్లు.. పడవలతో ఎంతో అందంగా ఉన్నాయి. కేరళలో ఆ సాంగ్ షూట్ చేసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఆ పాటను ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ రాశారు. దీన్ని స్టార్ ఫోక్ సింగర్ మధుప్రియ తో కలిసి భీమ్స్ సిసిరోలియో ఆలపించారు.

భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన శశిరేఖ సాంగ్ ప్రోమో.. ఇప్పుడు మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రోమో చాలా బాగుందని నెటిజన్లు, సినీ ప్రియులు, మ్యూజిక్ లవర్స్ కామెంట్లు పెడుతున్నారు. పూర్తి పాట కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లో ఫుల్ సాంగ్ విడుదల అవుతుంది. మరి శశిరేఖ పాట.. ఎలా ఉంటుందో.. ఎంతలా ఆకట్టుకుంటుందో.. ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.


Full View


Tags:    

Similar News