స్మృతీ మందాన..వివాహం రద్దు చేసుకుందా.. అసలేమైందంటే?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరుగుతోంది అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది.;
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరుగుతోంది అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఏ విషయాన్నైనా సరే ఇట్టే తెలుసుకుంటున్నారు. ఇకపోతే ఈ సోషల్ మీడియా అనేది మంచికే కాదు చెడుకి కూడా కొంతమంది వినియోగిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి.. వీరికి సంబంధించిన ఏదైనా విషయం వైరల్ అయిందంటే చాలు అందులోని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మరీ దానిని వైరల్ చేస్తున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా స్మృతీ మంధానాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
గత రెండు నెలల క్రితమే తమ వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకున్న ఈమె.. ఇప్పుడు సడన్గా ఎంగేజ్మెంట్ రింగు కూడా తన చేతికి కనిపించకపోవడంతో వివాహాన్ని రద్దు చేసుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ భారత మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన నవంబర్ 23న తన స్నేహితుడు , ప్రముఖ స్వరకర్త పలాశ్ ముచ్చల్ తో నిశ్చితార్థం చేసుకుంది. అయితే వివాహం జరగాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వివాహం వాయిదా పడింది. డిసెంబర్ 5 2025న కోల్గేట్ కోసం ఒక ప్రమోషనల్ వీడియోతో ఇంస్టాగ్రామ్ లోకి తిరిగి వచ్చింది స్మృతీ. అయితే అభిమానులు ఆ వీడియోలో ఆమె వేలికి నిశ్చితార్థపు ఉంగరం లేకపోవడాన్ని గమనించారు. దీంతో అప్పటినుంచి సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
స్మృతి తన కాబోయే భర్త నుండి వివాహాన్ని రద్దు చేసుకుందా.. అందుకే నిశ్చితార్థపు ఉంగరాన్ని ఆమె చేతి నుంచి తొలగించిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మరి కొంతమంది మాత్రం ఆమె చేతులకు మెహందీ లేకపోవడాన్ని గమనించి.. ఇది నిశ్చితార్థానికి ముందు చిత్రీకరించబడిన వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా ఇందులో ఏది నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం స్మృతి మందాన చేతికి ఎంగేజ్మెంట్ రింగు లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇకపోతే స్మృతి మందానాకు సంబంధించిన ఇలాంటి వార్తలు గత రెండు వారాల క్రితం కూడా వినిపించాయి. అసలు విషయంలోకి వెళ్తే.. వీరు తమ వివాహాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. కారణం స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతోనే వివాహ సంబరాలను నిలిపివేశారు. ఆ తర్వాత తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పెళ్లికి సంబంధించిన పోస్ట్లు కూడా కనిపించకపోవడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఎంగేజ్మెంట్ తర్వాత ఒక వీడియోని షేర్ చేసింది. అందులో సహచర క్రికెటర్లతో కలిసి "సంజో హో హి గయా" అనే బాలీవుడ్ సాంగ్ కి స్మృతీ డాన్స్ కూడా చేసింది. ఈ సందర్భంగా తన వేలికి ఎంగేజ్మెంట్ రింగు కనిపించింది. అయితే ఆ తర్వాత రిలీజ్ చేసిన వీడియోలో ఆమె ఎంగేజ్మెంట్ రింగు కనిపించకపోవడాన్ని నెటిజన్స్ నోటీస్ చేశారు. అయితే ఇప్పుడు మరొకసారి ఈమె షేర్ చేసిన వీడియోలో కూడా చేతికి రింగు కనిపించకపోవడంతోనే అనుమానాలు మరింతగా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై స్మృతి లేదా పలాశ్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.