టాలీవుడ్ లో విషాదం.. గుండెపోటుతో నటుడు మృతి

మన జీవితం కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని లెక్కలేసుకోవాలి. ఎందుకంటే కరోనాకు ముందు మనవళ్లు, మునిమనవళ్లకు సరిపడా సంపాదించాలని తెగ కష్టపడేవారు.;

Update: 2025-12-06 07:58 GMT

మన జీవితం కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని లెక్కలేసుకోవాలి. ఎందుకంటే కరోనాకు ముందు మనవళ్లు, మునిమనవళ్లకు సరిపడా సంపాదించాలని తెగ కష్టపడేవారు. కానీ కరోనా వచ్చి అందరినీ కబళించి ఇంట్లో లాక్ డౌన్ చేసేసరికి జనాల మైండ్ సెట్ మారింది. ఇప్పుడు అంతా ఎంజాయ్ కే ఎగబడుతున్నారు. టూర్లు, విందులు, వినోదాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక సమాజంలో గుండెపోట్లు పెరిగాయి. 30 ఏళ్లలోపు వారే గుండెపోటుతో మరణించడం కలిచి వేస్తోంది. ఇకప్పుడు 60 ఏళ్ల తర్వాత వచ్చే గుండెపోట్లు ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. ఉన్నట్టుండి కుప్పకూల్చేస్తున్నాయి.

వెండితెరపై తనదైన హాస్యంతో అలరించిన అలనాటి నటుడు, పాస్టర్ జోసెఫ్ గుండెపోటుతో మరణించడం టాలీవుడ్ విషాదం నింపింది. . గురువారం ఏలూరు జిల్లా నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన పాస్టర్, సినీ నటుడు మరిపూడి జోసెఫ్ (47) గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. చిలకలూరిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మార్గమధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది.

జోసెఫ్ తల్లిదండ్రులు మరిపూడి సుబ్బారావు-సుబ్బాలక్ష్మీల ఏకైక కుమారుడు.. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత 25 ఏళ్ల క్రితం ఉంగటూరు మండలం చేబ్రోలులో పాస్టర్ యోబు దగ్గరకు వెళ్లి అక్కడే ఉండి ఆయన వద్ద శిష్యరికం చేసి పాస్టర్ గా స్థిరపడ్డాడు.

జోసెఫ్.. ఎన్టీఆర్ తో కలిసి ‘పాతాళభైరవి' సహా ఆరు చిత్రాల్లో నటించారు. కృష్ణ, కృష్ణంరాజు, కమలహాసన్ వంటి అగ్రనటులతో కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాస్టర్ గాను ప్రసంగంలో నవ్వులు పూయించేవారు.

Tags:    

Similar News