లవ్ స్పెల్లింగ్ కూడా తెలియని ప్రభాస్ లవ్ లో ఎలా పడతాడు..?

రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా సరే అది ఇట్టే వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ కి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.;

Update: 2025-12-06 05:57 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ఏం చేసినా సరే అది ఇట్టే వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ కి సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటి అంటే విత్ లవ్ అని రాసి ఆటోగ్రాఫ్ పెట్టిన ప్రభాస్ లవ్ స్పెల్లింగ్ ని రాయడానికి కాస్త ఆలోచించాడు. అంటే లవ్ అని రాయడానికి బదులు వేరే రాశాడు. రెబల్ స్టార్ కి లవ్ స్పెల్లింగ్ కూడా తెలియదు అనేలా ఆ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని రెబల్ ఫ్యాన్స్ ప్రభాస్ ఎంత మంచోడో లవ్ స్పెల్లింగ్ కూడా తెలియదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

జపాన్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఆటోగ్రాఫ్..

బాహుబలి రెండు భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ సినిమా రెడీ చేశారు. ఈ సినిమా జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ లో ప్రభాస్ యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో జపాన్ ఫ్యాన్స్ కి ప్రభాస్ ఆటోగ్రాఫ్ ఇస్తూ లవ్ స్పెల్లింగ్ రాసేందుకు తడబడ్డాడు. ఐతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ లవ్ స్పెల్లింగ్ రాయడం రాదు అందుకే మ్యారేజ్ జోలికి వెళ్లట్లేదని అంటున్నారు.

ప్రభాస్ పెళ్లి విషయం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ అవుతుంది. అసలు లవ్ స్పెల్లింగ్ తెలియని అతనికి మ్యారేజ్ ఆలోచన ఏముంటుందని అంటూ లేటెస్ట్ వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాహుబలి ఎపిక్ జపాన్ ప్రమోషన్స్ లో ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి. జపాన్ లో బాహుబలి ఎపిక్ రిలీజ్ తో పాటు నెక్స్ట్ పాన్ ఇండియా వైడ్ రాజా సాబ్ తో రాబోతున్నాడు ప్రభాస్.

థ్రిల్లర్ జోనర్ లో ప్రభాస్ రాజా సాబ్..

2026 సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవుతుంది. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో అదరగొట్టబోతుంది. ప్రభాస్ ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ సినిమాను కూడా ఈమధ్యనే సెట్స్ మీదకు తీసుకెళ్లారు.

ప్రభాస్ నెక్స్ట్ ఐదేళ్లు తన సినిమాలను ఫిక్స్ చేసుకున్నాడు. కొత్తగా ఎవరైనా ప్రభాస్ తో సినిమా చేయాలంటే మాత్రం ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ లిస్ట్ లో కల్కి 2, సలార్ 2 కూడా ఉన్నాయి. ఐతే ప్రశాంత్ నీల్ తో సినిమాతో పాటు మరో రెండు భారీ ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి.

ప్రభాస్ సినిమాల లిస్ట్ తో ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందిస్తుంది. రాజా సాబ్ నెక్స్ట్ సంక్రాంతికి సూపర్ ఎంటర్టైన్ చేయడం పక్కా అనేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఫౌజీని కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News