వైష్ణవ్.. కృతి.. ఒక లవ్ స్టోరీ ప్లీజ్..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.;

Update: 2025-08-01 18:30 GMT

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టాడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీ నిర్మించారు. ఐతే ఈ సినిమా తర్వాత అటు వైష్ణవ్ తేజ్, ఇటు కృతి శెట్టి ఇద్దరు కూడా వరుస సినిమాలు చేశారు కానీ ఏ ఒక్కటి హిట్టు పడలేదు. వైష్ణవ్ ఉప్పెన తర్వాత 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కృతి శెట్టి శ్యాం సింగ రాయ్, బంగార్రాజు పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత అన్నీ పోయాయి.

ఛాన్స్ లు లేక డీలా..

ఇప్పుడు ఇద్దరికి ఒక అర్జెంట్ హిట్ పడితే కానీ కెరీర్ సరైన ట్రాక్ లో పడే ఛాన్స్ లేదు. వైష్ణవ్ తేజ్ కథల వేటలో ఉన్నాడని తెలుస్తుంది. కృతి శెట్టి మాత్రం ఛాన్స్ లు లేక డీలా పడింది. ఐతే అమ్మడు కోలీవుడ్ లో ప్రాజెక్ట్ లు చేస్తుంది. అక్కడ ఎల్.ఐ.కె సినిమాతో వస్తుంది కృతి శెట్టి. ప్రదీప్ రంగనాథ్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాపై కృతి శెట్టి చాలా హోప్స్ పెట్టుకుంది.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఇద్దరు కూడా కెరీర్ స్ట్రగుల్స్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి మరో సినిమా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఆడియన్స్. ఇద్దరు కలిసి మరో లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని అంటున్నారు. సూపర్ హిట్ పెయిర్ కాబట్టి కచ్చితంగా ఆ మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఉప్పెన జోడీ మరో సినిమా అంటే కూడా ఆడియన్స్ లో బజ్ ఉంటుంది.

బేబమ్మగా ఆడియన్స్ ని అలరించిన కృతి శెట్టి..

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిని కలిపే సినిమా ఏది అవుతుంది.. ఆ సినిమాను ఏ డైరెక్టర్ చేస్తాడన్నది చూడాలి. బేబమ్మగా ఆడియన్స్ ని అలరించిన కృతి శెట్టి నెక్స్ట్ సినిమాల విషయంలో కాస్త గ్లామర్ షో విషయంలో కూడా జోరు పెంచాలని చూస్తుంది. ఇప్పటికే అమ్మడు ఫోటో షూట్స్ తో తెగ రెచ్చిపోతుంది.

వైష్ణవ్ తేజ్ మాత్రం ఈసారి సినిమా తీస్తే పక్కా హిట్ అనే కథ కోసమే చూస్తున్నాడట. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తొలి సినిమా హిట్ కొట్టి ఆ తర్వాత ఫ్లాపులు పడటం చూస్తే హీరో ఎంత అన్ లక్కీ అన్నది అర్ధమవుతుంది.

Tags:    

Similar News