జలకాలాడుతూ సేద తీరుతున్న అందాల తార!
అంతేకాదు స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న వాణి కపూర్ అందంపై నెటిజన్లు వైరల్ కామెంట్స్ పెడుతున్నారు.;
సినిమా హీరోయిన్లు సమయం దొరికితే చాలు ఇష్టం అయిన ప్లేస్ లకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి చిల్ అవుతూ ఉంటారు. దొరికిందే సమయం అని వాడేసుకుంటూ ఉంటారు.అయితే తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ కూడా సిమ్మింగ్ పూల్ లో చిల్ అవుతూ ఉన్న ఫొటోస్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక ఈ బ్యూటీ ఎవరంటే బాలీవుడ్ నటి వాణి కపూర్.. బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్విమ్మింగ్ పూల్ లో సేద తీరుతున్న కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు,వీడియోలను షేర్ చేయడంతో పాటు వాటికి క్యాప్షన్ గా 100% నవ్వు సంభావ్యత అంటూ ఒక సూచన కూడా ఇచ్చింది.
ప్రస్తుతం వాణి కపూర్ షేర్ చేసిన ఫోటోస్,వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాణి కపూర్ అందాలకు చాలామంది ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ లో చిల్ అవుతున్న వాణి కపూర్ అందంపై నెటిజన్లు వైరల్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో వాణి కపూర్ షేర్ చేసిన పోస్ట్ కి క్షణాల్లో లక్షల్లో లైకులు , వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. వాణి కపూర్ పర్సనల్ కెరియర్..సినీ కెరీర్ విషయానికి వస్తే.. వాణి కపూర్ శివకుమార్ - డింపిలకు ఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించింది. వాణి కపూర్ తల్లి ఓ టీచరు కాగా..తండ్రి ఫర్నిచర్ ఎగుమతి వ్యాపారం చేసేవారు. అలా వాణి కపూర్ ఓపెన్ యూనివర్సిటీలో టూరిజం స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తర్వాత జైపూర్ లోని ఒబెరాయ్ హోటల్స్&రిసార్ట్ లో ఇంటర్న్ షిప్ పూర్తి చేసింది. అలా ఆ తర్వాత ఐటిసి హోటల్లో కూడా పనిచేసింది. అంతేకాకుండా మోడలింగ్ ప్రాజెక్టుల కోసం వాణి కపూర్ ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్ సంతకం కూడా చేసింది.అలా మొదట యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో మూడు సినిమాలకు సైన్ చేసింది. మొట్ట మొదటిసారి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణితి చోప్రాలు కలిసి నటించిన శుద్ధ్ దేశీ రొమాన్స్ అనే హిందీ మూవీలో సహాయక పాత్రలో నటించింది. ఈ సినిమాలో వాణికపూర్ నటించిన తార పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలోని వాణి కపూర్ పాత్రకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది.
ఆ తర్వాత వాణి కపూర్ తెలుగు,తమిళ భాషల్లో విడుదలైన ఆహా కళ్యాణం మూవీ ద్వారా సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ హీరోయిన్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. వాణి కపూర్ రాబోయే సినిమాల గురించి చూసుకుంటే.. బడ్డమీజ్ గిల్, సర్వగున్ సంపన్ వంటి సినిమాలు ఉన్నాయి.