ఆ బ్యూటీ కోరిక క్యాట్ తో ఫైటింగ్!
ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ కే పరిమితం. నాలుగు పాటలు..రొమాంటిక్ సన్నివేశాలతోనే హీరోయిన్ పాత్ర హైలైట్ అయ్యేది.;
ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ కే పరిమితం. నాలుగు పాటలు..రొమాంటిక్ సన్నివేశాలతోనే హీరోయిన్ పాత్ర హైలైట్ అయ్యేది. కానీ ఇప్పుడా సన్నివేశానికి భిన్నంగా హీరోయిన్ పాత్రలు తెరపై హైలైట్ అవుతున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. పాత్రల పరంగా సెలక్టివ్ గా ఉంటున్నారు. మనసుకు నచ్చితే తప్ప కమిట్ అవ్వడం లేదు. అవసరమైతే వచ్చిన అవకాశాన్ని వదులకోవడానికైనా సిద్దంగా ఉంటున్నారు గానీ పాత్ర పరంగా రాజీకి మాత్రం రావడం లేదు.
కొంత కాలం క్రితం ఫలానా పాత్రలో నటించాలని ఉందని బయటకు చెప్పడానికి ఆలోచించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. మనసుకు నచ్చిన పాత్రపై ముందే ఓపెన్ అవుతున్నారు. మేకర్స్ కూడా ఆరకంగా సిద్దమై పేరున్న భామల్ని కథలో భాగం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి వాణీ కపూర్ కూడా హీరోలకు ధీటుగా యాక్షన్ సన్నివేశాల్లో నటించాలని ఉందని ఓపెన్ అయింది. ఇటీవలే అమ్మడు `మండాలా మర్డర్స్` సిరీస్ తో అలరించిన సంగతి తెలిసిందే. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించింది.
అదే కాన్పిడెన్స్ తో వెండి తెరపై సైతం అలాంటి పాత్రలు పోషించడానికి తానేప్పుడు సిద్దంగా ఉంటానంది. ఈ సందర్బంగా మాధురి దీక్షిత్, శ్రీదేవి లాంటి నటీమణుల్ని గుర్తు చేసుకుంది. 80-90 కాలంలో వాళ్లిద్దరుపోషించిన పాత్రల గురించి చెప్పుకొచ్చింది. వాళ్ల తరహాలోనే తాను కూడా మెరవాలనుందని ఆశపడింది. పాత్ర బలంగా ఉంటే అది చిన్న రోల్ అయినా నటించడానికి సిద్దంగా ఉంటానంది. మూడు గంటల సినిమాలో ఓ పెద్ద పాత్ర కంటే చిన్న సినిమాలో బలమైన పాత్ర ఒక్కటి పోషించినా నటిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతామంది.
బలమైన యాక్షన్ ప్రధానమైన సినిమాల్లో నటించే అవకాశం వస్తే తానే ముందుంటానంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో తనకు జోడీగా కత్రినాకైఫ్ అయితే ఇంకా బాగుంటుందంది. కత్రినా యాక్షన్ సన్నివేశాలంటే తనకు ఎంతో ఇష్టమంది. అందుకే ఆమె తో తెరను పంచుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం వాణీ కపూర్క బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది. `సర్వగుణ సంపన్న`, `బెడ్ తామిజ్ గిల్` చిత్రాల్లో నటిస్తోంది.