ఉస్తాద్ లో మరో కెవ్వు కేక కన్ఫర్మ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ షూటింగ్ సందడి మొదలైంది.;

Update: 2025-07-14 04:03 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ షూటింగ్ సందడి మొదలైంది. ఈమధ్యనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ కి ఓకే చెప్పారు. రీసెంట్ గా కొద్దిరోజులు షూట్ కూడా జరిగిందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ అభిమానిగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని వేరే లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా మరోసారి గబ్బర్ సింగ్ ని గుర్తు చేసేలా చేస్తున్నారట. గబ్బర్ సింగ్ ఆల్బం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో ఆ సినిమాలోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఆ సినిమాలో కెవ్వు కేక సాంగ్ ఉర్రూతలూగించింది.

ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా అలాంటి ఒక స్పెషల్ సాంగ్ ని పెడుతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కూడా పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మూల కథను దళపతి విజయ్ తెరి నుంచి తీసుకున్నారు. దర్శక రచయిత దశరథ్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ యాక్షన్, డైలాగ్స్, పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ ఒక రేంజ్ లో ఉండబోతాయని తెలుస్తుంది.

వీటితో పాటుగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా బాగుంటుందని అంటున్నారు. గబ్బర్ సింగ్ తరహాలో కెవ్వు కేక సాంగ్ లాంటిది మరోటి పెడుతున్నారట. తప్పకుండా ఈ సాంగ్ మరోసారి ఫ్యాన్స్ ని షేక్ ఆడిస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. సో ఈ ఇయర్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

Tags:    

Similar News