భారీ మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ రైట్స్.. ఎవరికంటే?
రీసెంట్ గా వచ్చిన దేఖ్‌లేంగే సాలా సాంగ్ చార్ట్‌బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ లో పవన్ వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వింటేజ్ పవన్ ను గుర్తుచేశాయి.;
ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తైంది. పవన్ తన పోర్షన్ షూటింగ్ ను ఎప్పుడో పూర్తి చేయగా, మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో హరీష్ ఉన్నారు. ఈ మూవీపై ముందు నుంచే భారీ అంచనాలున్నాయి.
ఇండస్ట్రీ హిట్ గా గబ్బర్ సింగ్
దానికి కారణం పవన్- హరీష్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాంటి వారిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో గబ్బర్ సింగ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన కంటెంట్ కు కూడా ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
దేఖ్ లేంగే సాలాకు మంచి రెస్పాన్స్
రీసెంట్ గా వచ్చిన దేఖ్‌లేంగే సాలా సాంగ్ చార్ట్‌బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ లో పవన్ వేసిన స్టెప్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వింటేజ్ పవన్ ను గుర్తుచేశాయి. మోస్ట్ అవెయిటెడ్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అదే ఓటీటీ అప్డేట్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్నట్టు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అంటే పాన్ ఇండియా భాషల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానుందన్నమాట. ఇక సినిమా విషయానికొస్తే శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.