'ఉప్పు కప్పురంబు' హుక్ స్టెప్.. మీరు రెడీనా?
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా రానున్న ఉప్పు కప్పురంబు మూవీ జూలై 4వ తేదీన నుంచి స్ట్రీమింగ్ కానుంది.;
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ లీడ్ రోల్ లో రూపొందుతున్న సినిమా ఉప్పు కప్పురంబు. యంగ్ హీరో సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్న ఆ మూవీని బిచ్చగాడు ఫేమ్ ఐవీ శశి తెరకెక్కిస్తున్నారు. బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి వంటి పలువురు నటీనటులు భాగమైన చిత్రాన్ని ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధిక రావు నిర్మించారు.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా రానున్న ఉప్పు కప్పురంబు మూవీ జూలై 4వ తేదీన నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. దీంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ తర్వాత వినూత్నంగా సాంగ్స్ ను యూట్యూబ్ లో కాకుండా మ్యూజిక్ యాప్స్ లో విడుదల చేశారు. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా రిలీజ్ చేసిన సాంగ్స్.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. జియోసావన్, ఆపిల్ మ్యూజిక్ లాంటి ప్రముఖ మ్యూజిక్ యాప్స్ లో వినేందుకు అందుబాటులో ఉన్న సాంగ్స్.. నెట్టింట వైరల్ గా మారాయి.
అదే సమయంలో మేకర్స్ ఇప్పుడు వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఉప్పుకప్పురంబు టైటిల్ సాంగ్ లోని డ్యాన్స్ బిట్ ను మేకర్స్ షేర్ చేశారు. అందులో సుహాస్, కీర్తి సురేష్ ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి మెప్పించారు. హుక్ స్టెప్ తో ఇద్దరూ అలరించారు. ఉప్పుకప్పురంబు హుక్ స్టెప్ వచ్చేసింది, ఛాలెంజ్ లో జాయిన్ అవ్వమని రాసుకొచ్చారు మేకర్స్.
హుక్ స్టెప్ వేసి వీడియో చేయండని, తమను మస్ట్ గా ట్యాగ్ చేయాలని కోరారు. దీంతో వెంటనే ఉప్పు కప్పురంబు హుక్ స్టెప్ కు తెగ రీల్స్ కనిపిస్తున్నాయి. అలా ట్రెండింగ్ లో ఉండేందుకు మేకర్స్ మంచి ప్లాన్ వేశారని సినీ ప్రియులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఉప్పు కప్పురంబు మూవీ క్లిక్ అయ్యేలా కనిపిస్తుందని అంతా ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే ఉప్పు కప్పురంబు ఆల్బమ్ లో మూడు పాటలు ఉన్నాయి. వాటిలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు మనసుకు హత్తుకునేలా కనిపిస్తున్నాయి. గ్రామీణ శైలి, ఉల్లాసం, ధైర్యం అన్నీ కలగలిపి ఉన్నాయి. రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీ, రఘురాం ద్రోణ వజ్జల పాటలు రాయగా, స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందించారు. సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి, ఆంటోని దాసన్ ఆలపించారు.