ఉప్పు కప్పురంబు ఇదెలా సాధ్యమైంది..?
ఇలాంటి టైం లో ఒక సినిమాను నెల రోజుల లోపు పూర్తి చేయడం అంటే రికార్డ్ అని చెప్పొచ్చు. అలాంటి రికార్డ్ సృష్టించేలా చేశారు ఉప్పుకప్పురంబు టీం.;
ఒక సినిమా పూర్తి చేయాలంటే చాలా టైం తీసుకుంటున్నారు ప్రస్తుత దర్శకులు. సినిమా అది చిన్నదైనా పెద్దదైనా సరే అనుకున్న టైం లో పూర్తి చేయాలంటే అది కత్తి మీద సాము లాంటిదే అన్నట్టుగా ఉంది. ఏదో ఒక విధంగా పరిస్థితులు తారుమారవుతాయి. అనుకున్న రోజుల కన్నా షూటింగ్ మరికొన్ని రోజులు చేయాల్సి వస్తుంది. ఇలాంటి టైం లో ఒక సినిమాను నెల రోజుల లోపు పూర్తి చేయడం అంటే రికార్డ్ అని చెప్పొచ్చు. అలాంటి రికార్డ్ సృష్టించేలా చేశారు ఉప్పుకప్పురంబు టీం.
కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటించిన ఉప్పు కప్పురంబు సినిమాను ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా రాబోతుంది. ప్రైం వీడియో నుంచి వస్తున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఇంతకీ అదేంటి అంటే ఈ సినిమాను కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట. ఏంటి నిజమేనా అని ఆశ్చర్యపడక తప్పదు. ఈ సినిమాలో సుహాస్ తన పోర్షన్ ని 10 రోజుల్లో పూర్తి చేయగా.. కీర్తి సురేష్ కూడా కేవలం 18 రోజుల్లో సినిమా పూర్తి చేసిందట.
ఆఫ్కోర్స్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే మేకర్స్ అన్ని సిద్ధం చేయడం వల్లే అనుకున్నట్టుగా తక్కువ రోజుల్లో సినిమా కంప్లీట్ చేశారు. ఉప్పు కప్పురంబు సినిమాను అనిల్ ఐవి శశి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 1990 కాలంలో విలేజ్ లో స్మశానంలో ప్లేస్ కోసం గ్రామస్తులు పోటీ పడే కథతో తెరకెక్కించారు. సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూలై 4న ప్రైమ్ వీడియోలో స్త్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుందని అంటున్నారు.
ఓటిటి సినిమాల్లో కూడా కీర్తి తన సత్తా చాటుతుంది. ఐతే కీర్తి సురేష్ ఇదివరకు తమిళ్ లో వెబ్ సిరీస్, ఓటిటి సినిమాలు చేశారు. తెలుగులో చేసిన తొలి ఓటిటి సినిమా ఇదే అని చెప్పొచ్చు. సినిమాలో చాలామంది తెలుగు ఆడియన్స్ కు బాగా సుపరిచితులైన వారే ఉన్నారు. మరి ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఉప్పు కప్పురంబు సినిమా ఓటిటి ఆడియన్స్ ను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ఇదే కాకుండా కీర్తి సురేష్ విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్దన్, నితిన్ ఎల్లమ్మ సినిమాల్లో కూడా నటిస్తుంది.