• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమ్ముల - ధనుష్ మూవీ.. మరో...

కమ్ముల - ధనుష్ మూవీ.. మరో స్టార్ హీరో!

| ఈ సినిమా లో మరో స్టార్ హీరో కూడా గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-07-25 17:32 GMT

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ తో ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నట్లుగా ఎప్పుడో ప్రకటించారు. ఏషియన్ సినిమాస్ నిర్మించబోయే ఆ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని కూడా చాలా రకాల కథనాలు అయితే వచ్చాయి. అయితే సినిమా ను ప్రకటించి ఏడాది దాటిపోయినప్పటికీ కూడా ఇంకా కమ్ముల నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు.

ఇక మధ్య మధ్యలో అనేక రకాల రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. వాటి పై కూడా ఇంతవరకు దర్శకుడు నిర్మాతలు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు రెండేళ్ల పాటు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ కోసం సమయం వెచ్చించాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ రెడీ అనుకున్న తరువాతే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన న్యూస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినిమా లో మరో స్టార్ హీరో కూడా గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు. అక్కినేని నాగార్జున అని కూడా జోరు గా ఇండస్ట్రీలో అయితే ఒక టాక్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ విషయం లో ఎవరు కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.

కానీ నాగర్జున మాత్రం ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇదివరకే నాగర్జున చాలా సినిమాల లో ప్రత్యేకమైన గెస్ట్ పాత్రలు చేశాడు. ఇక వాటన్నిటికీ కూడా మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక ఇప్పుడు ధనుష్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దాదాపు 20 నుంచి 30 రోజుల మధ్యలో కొనసాగే షెడ్యూల్లో నాగార్జున పాల్గొంటారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయినట్లుగా టాక్. హీరోయిన్ విషయం లో అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ లిస్టులో రష్మిక మందన్న కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు విషయంలో మరో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • Dhanush 
  • Shekarkammula 
  • Asiancinemas 
  • Akkineni 
  • Nagarjuna 
  • Tollywood 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS