• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త ఆవకాయ్.. చరణ్‌కు...

కొత్త ఆవకాయ్.. చరణ్‌కు కంప్లైంట్ ఇచ్చిన ఉపాసన..!

| తాజాగా ఉపాసన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో కొత్త ఆవకాయ్ మేకింగ్ వీడియో కనిపించగా, అందులో చాగంటి గారి ప్రవచనం వాయిస్ ఓవర్‌గా వినిపించింది.

By - Tupaki Desk
Update: 2025-06-24 11:26 GMT

మెగా కోడలు ఉపాసన రామచరణ్, తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తరచూ కుటుంబానికి సంబంధించిన సరదా విశేషాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌కు ఫన్ ఫీడ్ అందిస్తుంటారు. ముఖ్యంగా ఆమెకు ‘అత్తమాస్ కిచెన్’ బ్రాండ్‌తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ హోమ్ మేడ్ ఫుడ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, సెలెబ్రిటీలకు స్పెషల్ హ్యాండ్లివరీస్ చేస్తూ, వాళ్ల రివ్యూలను షేర్ చేయడంలో బిజీగా ఉన్నారు ఉపాసన.

తాజాగా ఉపాసన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో కొత్త ఆవకాయ్ మేకింగ్ వీడియో కనిపించగా, అందులో చాగంటి గారి ప్రవచనం వాయిస్ ఓవర్‌గా వినిపించింది. అదే వీడియోలో మెగా ఫ్యామిలీ పెద్దలు సురేఖ, అంజనమ్మలు మాట్లాడుకుంటూ కనిపించారు. "కొత్త ఆవకాయ్ బాగుంది కానీ కొంచెం పులుపు తక్కువ అయితే బాగుండేది" అంటూ వారు చర్చించుకోవడం సరదాగా కనిపించింది.

ఈ వీడియోలో అత్తాకోడళ్ల మధ్య ఆవకాయ్ టేస్ట్‌పై చిన్న చర్చ మాదిరిగానే కనిపించినా, దీనిని ఉపాసన సరదాగా ఇది పెద్ద గొడవే అంటూ రామ్ చరణ్‌కి కంప్లైంట్ చేయడం ఫాలోవర్స్‌కి నవ్వులు పుట్టిస్తోంది. అంతేకాకుండా వీడియోలో సురేఖ గారు అందరికీ ప్రేమగా కొత్త ఆవకాయ్‌తో అన్నం ముద్దలు పెట్టడం హైలైట్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "సో స్వీట్" అంటూ కామెంట్లతో రెస్పాండ్ అవుతున్నారు.

అత్తమాస్ కిచెన్ బ్రాండ్ స్థాయి ఇప్పుడు మరింత పెరిగింది. టాలీవుడ్ స్టార్స్‌కు స్పెషల్‌గా ప్రొడక్ట్స్‌ పంపే ఉపాసన.. వాళ్లు ఇచ్చే టేస్ట్ ఫీడ్‌బ్యాక్‌లను తిరిగి షేర్ చేస్తుంటారు. ఫలానా సెలెబ్రిటీకి పొంగలి నచ్చింది, ఇంకొకరికి పులిహోర ఫేవరెట్ అంటూ ఉపాసన కథనాలు పంచుకుంటూ బ్రాండ్‌కి మరింత చేరువ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే కుమార్తె క్లీంకార బర్త్ డే సందర్భంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఉపాసనతో కలిసి ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. క్లీంకార పేరుతో హైదరాబాద్ జూ పార్క్‌లో ఉన్న పులిని కూడా ఆమెకు చూపించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం తిరిగొచ్చిన చరణ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.

Packing love and tradition from our home and sending it to you all.

At https://t.co/WhQ2JmjsaG , we bring the authentic Teluginti Avakaya that's not just any other pickle.
It's a legacy, a memory and an emotion put together.

A recipe passed down from generations that will… pic.twitter.com/o0IrMbmyZ6

— Upasana Konidela (@upasanakonidela) June 24, 2025
Tags:    
  • RamCharan 
  • UpasanaKonidela 
  • AthammasKitchen 
  • TelugintiAvakaya 
  • KonidelaFamily 
  • TraditionalRecipes 
  • AnjanaDevi 
  • SurekhaKonidela 
  • FamilyLove 
  • MegaFamily 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS