నీతా అంబానీ సరసన రామ్ చరణ్ అత్తగారు!
కేవలం భార్యగా ఉండటం వేరు.. వ్యవస్థాపకురాలిగా, సామాజిక వేత్తగా ఇతరులకు ఆదర్శంగా ఉండటం వేరు.;
కేవలం భార్యగా ఉండటం వేరు.. వ్యవస్థాపకురాలిగా, సామాజిక వేత్తగా ఇతరులకు ఆదర్శంగా ఉండటం వేరు. ఈ రెండు లక్షణాలతో ఉపాసన కొణిదెల ఎప్పుడూ షైనింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు రామ్ చరణ్ భార్యగా, ఎంటర్ ప్రెన్యూర్ గా, సామాజిక సేవికురాలిగా ఉపాసన కొణిదెల నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. అయితే ఉపాసన లాంటి యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ కి ఈమాత్రం గుర్తింపు, హోదా సరే కానీ, ఇప్పుడు ఉపాసన కొణిదెల మాతృమూర్తి సాధించిన ఘనత గురించి ఎందరికి తెలుసు?
ఉపాసన కామినేని మాతృమూర్తి శ్రీమతి శోభన కామినేని (రామ్ చరణ్ అత్తగారు) సాధించిన ఘనత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉపాసన ఇటీవల సోషల్ మీడియాలో 2025 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను షేర్ చేసారు. ఇందులో నీతా అంబానీ, ఇషా అంబానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి దిగ్గజాలు పేర్లు ఉన్నాయి. వారితో పాటు, జాబితాలో మూడవ పేరుగా తన తల్లి శోభన కామినేని పేరు నిలిచిందని ఉపాసన గర్వంగా చెప్పారు.
ఇది నిజంగా గర్వకారణం. ఈ సందర్భం గర్వించదగినదే కాదు.. భావోద్వేగాన్ని రేకెత్తించేది అని తెలిపింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో శక్తివంతమైన మహిళగా, వన్యప్రాణుల సంరక్షణలో బలమైన స్వరం వినిపిస్తున్న నేటి మహిళగా శోభన కామినేనికి సంఘంలో గొప్ప గుర్తింపు ఉంది. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ గాను ఎప్పుడూ బిజీగా ఉండే పర్సనాలిటీ.. మహిళల ఆరోగ్య సంరక్షణ గురించిన ఆలోచనలు, సేవలతోను సమాజంలో ఉన్నత స్థానాన్ని అందుకున్నారు.
ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. ఆమె నిరంతర కృషి, పట్టుదల, సృజనాత్మకతకు నిదర్శనం. తన తల్లి అద్భుత ప్రయాణాన్ని కుమార్తె ఉపాసన ఎంతగానో గౌరవిస్తారు. అందుకే తన తల్లి బాటలోనే ఉపాసన కూడా సామాజిక ధృక్పథంతో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతున్నారు. ర్యాంకుల కంటే శక్తివంతమైన మహిళగా తన తల్లి సాధించినది ఎప్పుడూ పదిమంది ఎంటర్ ప్రెన్యూర్ లకు స్ఫూర్తినిస్తూ ఉంటే అది ఇంకా ఆనందాన్నిస్తుందని ఉపాసన చెబుతారు.