గాయకుడితో దిశా డేటింగ్.. టైగర్ ఫ్యాన్స్ తట్టుకోలేక.
ఆ తర్వాత ముంబైలోని ఓ ఈవెంట్లో ఓపెన్ గా జతగా కనిపించారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ తో ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న పుకార్ మొదలైంది.;
పంజాబీ గాయకుడు తల్వీందర్ తో `లోఫర్` బ్యూటీ దిశా పటానీ ప్రేమాయణం సాగిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కృతి సనోన్ సోదరి నూపుర్ సనోన్- స్టెబిన్ బెన్ పెళ్లి వేడుకలో ఈ జంట బహిరంగంగా సన్నిహితంగా కనిపించింది. ఆ తర్వాత ముంబైలోని ఓ ఈవెంట్లో ఓపెన్ గా జతగా కనిపించారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ తో ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న పుకార్ మొదలైంది.
తాజాగా ఈ పుకార్ నిజమేనని ధృవీకరించేలా మాట్లాడాడు తల్వీందర్. ``ఇంత తొందరగా మా వెంటపడతారనుకోలేదు. ఒత్తిడిలో ఏదో ఒకటి చెప్పయలేము. మేం ప్రస్తుతం ఒకరినొకరం తెలుసుకుంటున్నాం!. నేను ప్రతిరోజూ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను ప్రేమలోనే ఉన్నాను`` అని తెలిపారు.
అయితే దిశాపటానీతో డేటింగ్ లో ఉన్నాను! అని స్పష్ఠంగా చెప్పలేదు. అతడు కేవలం హింట్ మాత్రమే ఇచ్చాడు. అర్థం చేసుకునే పనిలో ఉన్నాము అని అన్నాడు గనుక ప్రేమ ముగ్గులో దిగినట్టేనని అంతా భావిస్తున్నారు. పాపులర్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగించిన దిశా పటానీ, ఆ తర్వాత సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ అలెక్స్ ఇలిక్ తో సంబంధం లో ఉందని ప్రచారమైంది. కానీ ఆ ఇద్దరూ కూడా బ్రేకప్ అయ్యారు. ఇప్పుడు పంజాబీ గాయకుడు తల్వీందర్ సింగ్ తో ప్రేమ మొదలైంది. ఈ డేటింగ్ వ్యవహారం ఎటువైపు వెళుతుందో ఇప్పుడే చెప్పలేం.
ఇంకా టైగర్ పైనే మనసు..
అయితే దిశా పటానీ ప్రేమకథలో బిగ్ కాన్ ఫ్లిక్ట్ గురించి ఇటీవల కొంత చర్చ జరిగింది. తల్వీందర్ తో ముడిపెడుతూ మీడియా ప్రచారం సాగిస్తున్నా కానీ, తన మనసులో ఇంకా టైగర్ ష్రాఫ్ ఉన్నాడని ఒక వర్గం వాదిస్తోంది. ఇటీవల టైగర్ ని మెప్పించేందుకు తాను మార్షల్ ఆర్ట్స్ లో చాలా మెళకువలు నేర్చుకున్నానని తన కోసం చచ్చిపోతాననే అర్థం వచ్చేలా మాట్లాడింది దిశా. టైగర్ తనను ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ! అంటూ ఆవేదన చెందింది. దీంతో ఇప్పటికీ టైగర్ ష్రాఫ్ నే దిశా పటానీ ప్రేమిస్తోందని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు గాయకుడు తల్వీందర్ సింగ్ తో షికార్ చేస్తుంటే దీనిని టైగర్ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొందరు అభిమానులు దిశా డబుల్ స్టాండార్డ్ గురించి సోషల్ మీడియాల్లో నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరికొందరు దిశా ఏం చేయాలో నిర్ణయించే అధికారం ఎవరికీ లేదని వాదిస్తున్నారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, దిశా పటానీ ప్రస్తుతం ఓ రోమియో చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల కానుంది. దురంధర్ లో కమ్మో జీ పాటతో తల్విందర్ ఇమేజ్ స్కైని తాకింది. అంతకుముందు పలు సూపర్ హిట్ సాంగ్స్ ని అతడు ఆలపించాడు.