అమ్మకే ఆస్తులన్నీ వదిలేసి అమెరికాకు!
అలనాటి అందాల తార భాను ప్రియ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 150 చిత్రాలలో నటించారు.;
అలనాటి అందాల తార భాను ప్రియ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 150 చిత్రాలలో నటించారు. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. చిన్న వయసులోనే డాన్సుకు బీజం పడటంతో భాను ప్రియ గొప్ప డాన్సర్ గా ఓ వెలుగు వెలిగారు. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన భానుప్రియ కూచిపూడి, భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. తాను గొప్ప డాన్సర్ అవ్వడానికి కారణం ఆ రకమైన శిక్షణే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే కళను తన జీవనోఫాదిగాను మలుచుకున్నారు.
ప్రేమ ప్రపోజల్ ఆయనదే:
సినిమాలు లేని సమయంలో డాన్సు స్కూల్స్ ప్రారంభించి ఎంతో మంది పిల్లల్ని గొప్ప డాన్సర్లగా తీర్చి దిద్దారు. తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. భాను ప్రియ చెన్నైకి చెందిన కౌశల్ అనే ఫోటో గ్రాఫర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ పెళ్లి వెనుక చాలా కథే ఉందని తెలుస్తోంది. భాను ప్రియకు ముందుగా ప్రేమ రాయభారం పంపింది కౌశల్. ఆయన ఇష్టపడటంతోనే భానుప్రియ ప్రేమను అంగీకరించారు. కానీ వారి పెళ్లికి భాను ప్రియ తల్లి అభ్యంతరం వ్యక్తం చేసారు.
తల్లి స్వార్దంతో అమెరికాకు:
ఈ విషయంలో తల్లి తన స్వార్దం చూసుకుందని ఓ సీనియర్ దర్శకుడు తెలిపారు. ఇది గ్రహించి భానుప్రియ తాను కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీంటిని తల్లికే వదిలేసి అమెరికా వెళ్లిపోయారన్నారు. అక్కడ కౌశల్ ని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. భాను ప్రియ ఒకరి మీద ఆధారపడాల్సిన పనిలేదని భావించే మహిళగా పేర్కొన్నారు. ఈక్రమంలోనే అమెరికాలో కూడా డాన్స్ స్కూల్ ప్రారంభించి పిల్లలకు శిక్షణ ఇచ్చేదన్నారు. కుటుంబం పట్ల కూడా అంతే విధేయతగా ఉండేవారు. అత్త పట్ల గౌరవం, భర్త పట్ల ప్రేమ మాటల్లో చెప్పలేనిది.
వ్యసనాలకు బానిసగా భర్త:
అయితే అత్తగారు స్వర్గస్తులైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవ్వడం, ప్రతిగా భర్త వ్యసనాలకు బాసినగా మారడం జరిగిందన్నారు. `ఈ క్రమంలోనే భరించలేని స్థితిలో భాను ప్రియ తిరిగి చెన్నైకి వచ్చేసింది. దీంతో భర్త నుంచి రావాల్సిన ఆస్తులు కూడా ఏవీ రాలేదున్నారు. ఆమధ్య మెమోరీ లాస్ తో బాధపడిందన్నారు. ఇప్పుడా పరిస్థితుల నుంచి పూర్తిగా బయట పడిందని తెలిపారు. ప్రస్తుతం భాను ప్రియ వయసు 58 ఏళ్లు.
భాను ప్రియ కూతురు అభినయ ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో నాచురల్ సైన్స్ విభాగంలో డిగ్రీ చదువుతోంది. కుమార్తెకు సినిమాలంటే ఆసక్తి లేదని గతంలో భాను ప్రియ తెలిపారు.