తమకంటే ముందే చెల్లెళ్లకు వివాహాలు చేస్తున్న హీరోయిన్స్..

సాధారణంగా ఎక్కడైనా సరే వివాహం అంటే ఇంట్లో పెద్ద వాళ్లకు వివాహం చేసి ఆ తర్వాత చిన్నవాళ్లు వివాహం చేసుకుంటారు.;

Update: 2026-01-05 05:46 GMT

సాధారణంగా ఎక్కడైనా సరే వివాహం అంటే ఇంట్లో పెద్ద వాళ్లకు వివాహం చేసి ఆ తర్వాత చిన్నవాళ్లు వివాహం చేసుకుంటారు. ఒకవేళ అబ్బాయి, అమ్మాయి ఆ ఇంట్లో ఉన్నట్లయితే ముందుగా అమ్మాయికి వివాహం చేసి, ఆ తర్వాత అబ్బాయి వివాహం చేసుకుంటారు. ఇకపోతే సెలబ్రిటీల విషయంలో ఇది విరుద్ధంగా జరుగుతోందనే చెప్పాలి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలనే నేపథ్యంలో ముందుగా తాము వివాహం చేసుకోకుండా. తమ చెల్లెళ్లకు వివాహం చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు కొంతమంది హీరోయిన్లు. మరి తమకంటే ముందే తమ చెల్లెళ్లకు వివాహాలు చేసిన ఆ సెలబ్రిటీస్ ఎవరో ఎప్పుడు చూద్దాం.

సాయి పల్లవి:

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ చిత్రం రామాయణంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈమె నటించిన మరో చిత్రం మేరే రహో. ఈ ఏడాది జూన్లో విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా తమ కంటే ముందుగా తమ చెల్లెళ్లకు వివాహం చేసిన జాబితాలో నిలిచిన వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. సాయి పల్లవి ప్రస్తుతం సినిమాల పైన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తన చెల్లెలు పూజా కన్నన్ కు వివాహం జరిపించింది. ముఖ్యంగా చెల్లెలికి దగ్గరుండి పెళ్లి చేయడమే కాకుండా ఆ పెళ్లిలో అన్ని తానై ముందుండి నడిపించింది.

కాజల్ అగర్వాల్:

ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన విషయం తెలిసిందే. ఈమె కూడా తన చెల్లెలు ప్రముఖ హీరోయిన్ నిషా అగర్వాల్ కి తనకంటే ముందే వివాహం జరిపించింది. నిషా అగర్వాల్ కి ఒక కొడుకు కూడా జన్మించారు. ఇక ఈమె వివాహం తర్వాతనే కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది.

కృతి సనన్:

ఈ జాబితాలోకి చేరిన మరో హీరోయిన్ కృతి సనన్.. ప్రస్తుతం ఈమె సోదరి నుపూర్ సనన్ సింగర్ స్టెబిన్ బెన్ తో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్నారట. అయితే ఇప్పుడు ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎంగేజ్మెంట్ పూర్తయిందని, తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక త్వరలోనే పెళ్లి కూడా జరగనుంది.

పూజా హెగ్డే..

ప్రముఖ స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న పూజా హెగ్డే 2023 డిసెంబర్ లో ఆమె సోదరుడు రిషబ్ హెగ్డే, శివానీ శెట్టిల వివాహం జరిపించారు.. సోదరుడి పెళ్లిలో ఆమె సందడి చేయడమే కాకుండా భావోద్వేగం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పంచుకుంది.

Tags:    

Similar News