• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భార్య‌పై అధ్య‌క్షుడు...

భార్య‌పై అధ్య‌క్షుడు అత్యాచారం.. ట్రంప్ బ‌యోపిక్ షాక్‌లు!

| కేన్స్ లో ప్ర‌ద‌ర్శించిన విజువ‌ల్స్ లో ట్రంప్ జీవితంలోని అనేక షాకింగ్ మూవ్‌మెంట్స్ ని తెరపై చూపించార‌ని కూడా చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-05-21 20:07 GMT

డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద బయోపిక్-'ది అప్రెంటిస్' కేన్స్ -2024 లో ప్ర‌ద‌ర్శించ‌గా అది ప్ర‌కంప‌నాలు రేపింది. ఒక ర‌కంగా ఇది సినిమా పండుగ‌ను షేక్ చేసిందంటూ వార్తా క‌థ‌నాలు వెలువడుతున్నాయి. వ్యాపారవేత్త, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో సెబాస్టియన్ స్టాన్ డొనాల్డ్ ట్రంప్ పాత్రలో నటించారు. ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఎలా మార్మోగిందో చూపించే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ చిత్రంలో అతడి వ్యక్తిగత జీవితాన్ని తెర‌పై చూపించారని స‌మాచారం. ఈ చిత్రం థియేట‌ర్ల‌లో బ్లాస్ట్ అవ్వ‌డం ఖాయం అంటూ కేన్స్ లో విజువ‌ల్స్ వీక్షించిన వారు ప్ర‌శంసించారు. ఇందులో సంథింగ్ ఏదో మ్యాట‌ర్ ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. కేన్స్ లో ప్ర‌ద‌ర్శించిన విజువ‌ల్స్ లో ట్రంప్ జీవితంలోని అనేక షాకింగ్ మూవ్‌మెంట్స్ ని తెరపై చూపించార‌ని కూడా చెబుతున్నారు.

తాజా మీడియా క‌థ‌నాల ప్ర‌కారం... డొనాల్డ్ ట్రంప్ తన మాజీ భార్య ఇవానాపై అత్యాచారం చేసి, త‌న క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు అండర్ వరల్డ్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాడ‌ని కూడా తెర‌పై చూపించార‌ట‌. ఈ చిత్రంలో 1970 - 1980 లలో ట్రంప్‌ జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. సినిమాని వీక్షించిన సెల‌బ్రిటీలు చాలా మంది న‌టీన‌టుల‌ న‌ట‌న‌ను ప్రశంసిస్తూ 8 నిమిషాల పాటు చ‌ప్ప‌ట్ల‌తో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌ముఖ స్టార్ కేట్ బ్లాంచెట్ ఎనిమిది నిమిషాల పాటు నిలబడి చ‌ప్ప‌ట్లు కొట్ట‌డ‌మే కాదు.. ఇందులో న‌టించిన‌ టైటిల్ పాత్ర‌ధారి సెబాస్టియన్ స్టాన్ ను కౌగిలించుకున్నారు.. డైరెక్టర్ అలీ అబ్బాసిని అభినందించారు.

అయితే ట్రంప్ బ‌యోపిక్ పై అంస‌తృప్తిగా ఉన్న వారి బృందం ఈ చిత్రంపై దావా వేస్తున్నారని, యుఎస్‌లో విడుదల కాదని కూడా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. త‌ప్పుగా చూపిస్తున్నారు. ఈ చెత్త ఒక‌ కల్పన.. ఇది చాలా అబద్ధాలతో సంచలనం రేపే ప్ర‌య‌త్నం! అని ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చేంగ్ న్యూయార్క్ పోస్ట్‌తో అన్నారు. ఈ ఫిల్మ్ హానికరమైనది.. పరువు నష్టం క‌లిగిస్తోంది. ఇది విడుద‌ల కాదు. క‌నీసం డీవీడీ రూపంలో కూడా బ‌య‌ట దొర‌క‌దు! అంటూ హెచ్చ‌రించారు.

ప్రీమియర్ తర్వాత కేన్స్ వద్ద చిత్ర ద‌ర్శ‌కుడు అబ్బాసి విలేకరులతో మాట్లాడుతూ, ''డోనాల్డ్ ట్రంప్ బృందం మాపై కేసు పెట్టడానికి ముందు సినిమా చూడటానికి వేచి ఉండాలి. ఇది అతడు ఇష్టపడని సినిమా అని నేను అనుకోను… అతడు ఆశ్చర్యపోతాడని నేను భావిస్తున్నాను'' అని అన్నారు. అప్రెంటిస్ సెబాస్టియన్ స్టాన్ మాజీ అధ్య‌క్షుడి పాత్రలో నటించగా, జెరెమీ స్ట్రాంగ్ తన న్యాయవాది, గురువు రాయ్ కోన్ పాత్రను పోషించారు. ఈ చిత్రం (ది అప్రెంటిస్) రిలీజ్ తేదీపై ఇంకా క్లారిటీ లేదు. యుఎస్ స‌హా ప్రపంచవ్యాప్త విడుదల తేదీలను ప్రకటించాల్సి ఉంది.


Cate Blanchett led the eight-minute #Cannes2024 standing ovation for ‘The Apprentice,’ hugging Sebastian Stan and congratulating director Ali Abbasi. pic.twitter.com/3ntckc2uGA

— Ramin Setoodeh (@RaminSetoodeh) May 20, 2024


Tags:    
  • Hollywood 
  • TheApprentice 
  • TrumpBiopic 
  • Cannes2024 
  • UnitedStaesOfNation 
  • SebastianStan 
  • StevenCheng 
  • Abbasi 
  • RoyChon 
  • Jeremy 
  • Lawyer 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS