• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైర్ 2 బెటర్ అనుకుంటున్న...

టైర్ 2 బెటర్ అనుకుంటున్న గురూజీ..?

| మాటల మాంత్రికుడు త్రివిక్రం గుంటూరు కారం తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు

By - Tupaki Desk
Update: 2024-07-14 07:21 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రం గుంటూరు కారం తర్వాత ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. గుంటూరు కారం సినిమా హిట్టైనా సరే ఎందుకో ఆ హిట్ క్రెడిట్ అంతా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలోనే వేశారు. రొటీన్ కథతోనే వచ్చినా త్రివిక్రం మార్క్ మ్యాజిక్ చేస్తాడు. కానీ గుంటూరు కారం లో అది వర్క్ అవుట్ కాలేదు. త్రివిక్రం నెక్స్ట్ సినిమా ఏంటన్న దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అసలైతే అల్లు అర్జున్ తో త్రివిక్రం సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే అనిపిస్తుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకోగా గురూజీని అందుకు తగిన కథ సిద్ధం చేయమన్నట్టు తెలుస్తుంది.

ఐతే త్రివిక్రం అందుకు కాస్త టైం కావాలని చెప్పాడట. ఐతే అల్లు అర్జున్ కాకపోతే త్రివిక్రం తో సినిమా చేసేందుకు మరో స్టార్ హీరో సిద్ధంగా లేడు. స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటుతున్నారు. వారితోని సాధ్యమయ్యే పని కాదని త్రివిక్రం టైర్ 2 హీరోల మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. గురూజీ చేస్తానంటే చాలు కానీ ఒక్క పిలుపు దూరంలో ఉంటారు.

నాని, రామ్ లతో త్రివిక్రం సినిమా ఉండొచ్చని కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా వాటిపై సరైన స్పష్టత రాలేదు. ముఖ్యంగా రాం తో త్రివిక్రం సినిమా చేయాలని అనుకుంటున్నాడు. స్రవంతి రవికిశోర్ మీద ఉన్న అభిమానం తో అయినా రామ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గురూజీ కథ రెడీ చేస్తే చాలు రామ్ కావాల్సినన్ని డేట్స్ ఇచ్చేస్తాడు.

నాని లాంటి న్యాచురల్ యాక్టర్ తో కూడా త్రివిక్రం లాంటి డైరెక్టర్ సినిమా తీస్తే బాగుంటుందని ఆడియన్స్ కోరుతున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో చేసిన నాని కొత్త దర్శకులతో పనిచేస్తూ వరుస హిట్లు కొడుతుంటాడు. అందుకే నాని అయినా సరే త్రివిక్రం తో పర్ఫెక్ట్ కాంబో అని అంటున్నారు. వాళ్లిద్దరు కాకుండా మరో హీరో ఎవరన్నది చెప్పడం కష్టం. మొత్తానికి త్రివిక్రం నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఐతే ఈసారి హీరో ఎవరైనా సరే తన మార్క్ చాటేలా సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడట త్రివిక్రం. మరి ఆ కాంబో ఏంటన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

Tags:    
  • Trivikramsrinivas 
  • Trivikram 
  • Tollywood 
  • Tier2heroes 
  • Gunturkaaram 
  • Tollywooddirector 
  • Filmindustry 
  • Nani 
  • Ram 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS